అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది విలన్లు  ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్  విలన్లు ఉన్నప్పటికీ రాజమౌళి సినిమాలో ఉండే విలన్ లకు  మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాల్లో విలన్ పాత్రలు ఎంతో బలంగా  చూపిస్తూ ఉంటాడు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయి.. మరి హీరోలను ఢీకొట్టే విలన్ పాత్రలు కూడా అంతే పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తూ ఉంటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటివరకు రాజమౌళి సాదాసీదా విలన్ లను  కూడా స్టార్ విలన్లుగా మార్చేసి భారీ క్రేజ్ తెచ్చి పెట్టాడు. ఇలా అప్పటివరకు ఒక సాదా సీదా విలన్ గా ఉన్నా ప్రభాకర్ కు ... బాహుబలి సినిమా తర్వాత స్టార్ విలన్ గా మార్చేసాడు రాజమౌళి. 

 

 

 రాజమౌళి సినిమాలో పవర్ఫుల్ విలన్ కాలకేయుని పాత్రలో డిఫరెంట్ గెటప్ లో నటించాడు ప్రభాకర్.. దీంతో ప్రభాకర్ గా ఉన్నా అతని పేరు బాహుబలి సినిమా తర్వాత బాహుబలి  ప్రభాకర్  గా మారిపోయింది. ఇక బాహుబలి సినిమాలో  కాలకేయుని గా విలన్ పాత్రలో నటించి ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు బాహుబలి ప్రభాకర్. జక్కన చెక్కిన శిల్పాలు అద్భుతంగా మారినట్లు.. రాజమౌళి చెక్కిన విలన్ ప్రభాకర్ స్టార్ విలన్ గా మారిపోయాడు. బాహుబలి ఒక్క సినిమాతో ప్రభాకర్ క్రేజ్  ఎక్కడికో వెళ్ళి పోయింది అనే చెప్పాలి. 

 

 

 అయితే విలన్ పాత్రలకే కొత్త భాషను నేర్పాడు ప్రభాకర్. అప్పటివరకు అసలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని కిలికిలి భాష లో డైలాగులు చెప్పి అందరిని ఆశ్చర్య పరిచాడు. మామూలుగానే కాలకేయుడు పాత్రలో పూర్తిగా ఒంటికి మొత్తం నల్ల రంగు పూసుకొని రాక్షసుడిగా కనిపిస్తూ... సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరిని ఆశ్చర్య పరిచిన ప్రభాకర్... ఇక డైలాగ్ ఎలా చెప్తాడో  అని ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న సమయంలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో  కిలికిలి భాషలో డైలాగ్ చెప్పి... అందరిని అయోమయంలో పడేస్తాడు. ఇక ప్రభాకర్ డైలాగ్ చెప్పిన కొంతసేపటికి కానీ అర్థం కాదు... డిఫరెంట్ లాంగ్వేజ్ లో  ప్రభాకర్ డైలాగ్ చెబుతున్నాడు అని. ఇలా విలనిజానికి కొత్త భాషను తీసుకొచ్చాడు ప్రభాకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: