తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. అంటే తెలుగులో నటులే లేరా అంటే అదీ కాదు. ఎంతో మంది ఉన్నా కూడా కమర్షియల్ హంగుల కోసమో, లేదా కుంటిసాకులు చెప్పో ఇతర భాషల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. వారికి భాష రాక చాలా కష్టపడాల్సి వచ్సినా సరే వారినే ప్రిఫర్ చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు లాంటి నటుల కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 

 


అయితే ప్రస్తుతం ఈ కొరతని రావు రమేష్ కొద్దిగా తీరుస్తున్నాడనే చెప్పాలి. పాత్ర ఏదైనా సరే తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. హీరోయిన్ తండ్రిగా, విలన్ గా ఆయన చూపిస్తున్న వైవిధ్యం ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది. పాత్ర ఏదైనా సరే తన ప్రభావాన్ని చాలా బలంగా చూపిస్తాడు. కొన్ని కొన్ని సినిమాల్లో పాత్రలు రావురమేష్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని చాలా సార్లు అనుకుంటారు.

 

మొన్నటికి మొన్న ప్రతిరోజూ పండగే చిత్రంలో ఆయన నటనని ప్రేక్షకులు జేజేలు కొట్టారు. ఈ చిత్రంలో సాయితేజ్ కి తండ్రిగా రావు రమేష్ నటించారు. సినిమా మొత్తం ఆయన పండించిన ఎమోషన్.. సెంటిమెంట్.. కామెడీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు. కొడుకుగా నటించిన సాయితేజ్.. తాతగా నటించిన సత్యరాజ్ ఆయనకు రెండు భుజాలుగా ఉన్నారంతే. 

 

సినిమా ఆడిందంటే కేవలం రావు రమేష్ వల్లే అని మారుతి- సాయితేజ్ వంటి అందరు తారాగణం బహిరంగంగానే చెప్పడం విశేషం. అయితే ఇప్పుడు ఇలాంటి పాత్రే మరోటి రాబోతుందట. సాయి ధరమ్ తేజ్ తర్వాతి చిత్రం సోలో బ్రతుకే సో బెటరు సినిమాలో రావు రమేష్ పాత్ర అలాగే ఉండనుందట. ఈ సినిమాలోనూ రావు రమేష్ తన శైలి నటనతో నవ్విస్తాడట. మరి అంతగా చెప్తున్న ఈ పాత్ర ఎలా ఉంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: