టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే వెండి తెరపై తన సత్తా చాటుతున్నారు.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ మూవీ లో నటించారు.  ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ దారుణమై ఫలితాన్నొ పొందింది.  పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత ఏపిలో జరిగిన ఎన్నికల హడావుడిలో మునిగిపోయారు పవన్ కళ్యాన్.  జనసేన పార్టీ తరుపు నుంచి పోటీ చేసిన ఆయన రెండు చోట్ల నుంచి ఓడిపోయారు.  అయితే తమ ఓటమికి గల కారణాలుపై సమీక్షలు నిర్వహిస్తూనే.. ఇప్పుడు వెండి తెరపై మరోసారి తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. 


ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ వరుసగా సినిమాలు తీసేందుకు సిద్దమవుతున్నారు.  ప్రస్తుతం ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం పవన్ కళ్యాన్ హీరోగా ‘వకీల్ సాబ్’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ బాలీవుడ్ లో అమితాబచ్చన్ పింక్ రిమేక్. ఈ మూవీ తమిళ్అజిత్ నటించాడు. రెండు భాషల్లో మంచి సక్సెస్ సాధించింది.  ఈ మూవీలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతున్నారు. ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నారు పవన్.  


మొఘల్ సామ్రాజ్యంలో తెలుగు వారిపై జరుగతున్న దాష్టికంపై ఓ వీరుడు గజదొంగగా మారి ఉన్నవారిని దోచి లేనివారికి పంచే పాత్రలో రాబిన్ వుడ్ తరహాలో ఈ పాత్ర ఉండబోతుందట. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఓ లుక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో ప‌వ‌న్ నుదుటిన పొడ‌వాటి ఎర్ర‌బొట్టు పెట్టుకొని తీక్ష‌ణంగా చూస్తున్నారు. ఈ ఫోటో చూస్తుంటే మాత్రం క్రిష్ తెర‌కెక్కిస్తున్న మూవీ పీరియాడిక్ డ్రామాగానే అర్ధ‌మ‌వుతుంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు.  ఈ మూవీలో హీరోయిన్లు ఎవరు అన్న విషయం పై ఇంకా అనౌన్స్ మెంట్స్ రాలేదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: