రఘువరన్ అనేక సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. విలన్ గా ఇతను ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు .200  కి పైగా  సినిమాలు చేసి సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. తమిళనాడు లో  పుట్టి తెలుగు తెర మీద తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులని  కూడా మెప్పించాడు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాలలో నటించాడు.

 

IHG

 

కేవలం ప్రతి నాయకుడు పాత్రనే కాక తండ్రి, స్నేహితుడు వంటి పాత్రలని కూడా నటించాడు. శివ సినిమాలో విలన్ గా  చేసి హిట్ అందుకున్నాడు. ఆ పాత్ర తనకి మంచి టర్నింగ్ పాయింట్ అయ్యింది. పసివాడి ప్రాణం, న్యాయానికి సంకెళ్ళు, కాంచన సీత, రుద్రా నేత్ర, లంకేశ్వరుడు, శివ, చైతన్య, లాఠీ, విట్నెస్, అనగనగ ఒక రోజు, ఆహా, అనగనగ ఒక అమ్మాయి, పెళ్లి సంబంధం, ఆజాద్, సీమ సింహం, బాబీ, నాగ, జానీ, నాని, మాస్, ఎవడైతే నాకేంటి, పెళ్ళికాని ప్రసాద్ ఇలా అనేక సినిమాలలో నటించాడు.

రఘువరన్  వాయిస్ మాడ్యులేషన్  కి ,ఆయన నటన శైలి కి ఎంతో మంది అభిమానులు వున్నారు .ఎప్పుడు విలన్ గా కనిపించే  రఘువరన్  సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ కి సపోర్టింగ్ తండ్రిగా నటించారు .ఇలాంటి  పాత్రలని కూడా చేయడం గమనార్హం. రఘువరన్ ఎవరికీ తెలియని రచయిత కూడా ,తను  రాసిన పాటలని విడుదల చేయడం జరిగింది.

IHG

 

తాను రచయత అని తెలిసిన తన మొదటి భార్య మరియు కొడుకు వాటిని రిలీజ్ చేయించారు. ఈ ఆరు పాటలు సూపర్ స్టార్ రజినికాంత్ చేతుల మీదగా విడుదల చేయించడం జరిగింది. రజినీకాంత్ నటించిన భాష సినిమాలో కూడా ఈ విలన్ రఘువరన్ నటించడం కూడా జరిగింది. ఇలా అనేక సినిమాల్లో రఘువరన్ నటించాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: