యాంకర్ ప్రదీప్ హీరోగా తోలి ప్రయత్నంగా వస్తున్నా సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? మున్నా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. నీలి నీలి ఆకాశం అంటూ ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెంచిన ప్రదీప్ తన మొదటి సినిమాతోనే హిట్టు కొట్టేలా ఉన్నాడు. ఇక ఉగాది కానుకగా ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా వల్ల థియేటర్ల బంద్ కావడంతో సినిమా రిలీజ్ వాయిదా అయ్యే ఛాన్స్ ఉంది.

 

అయితే రిలీజ్ పై క్లారిటీ లేకున్నా సరే ప్రదీప్ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా కథ హాలీవుడ్ సినిమాల స్పూర్తితో రాసుకున్నారట. సినిమా కథ మాములుగా మొదలై హీరో హీరోయిన్ పాత్రలు ఒకరి పాత్రలోకి మరొకరు మారిపోతారట. ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లో 2,3 వచ్చాయి. వాటి స్పూర్తితో ప్రదీప్ సినిమా వస్తుందట. అయితే మనవాళ్ళు ఇన్ స్ప్రెషన్ అని చెప్పి హాలీవుడ్ సినిమాలు మక్కీకి మక్కీ దించిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. పవర్ స్టార్, త్రివిక్రమ్ లాంటి వారే ఆడియెన్స్ ను మోసం చేయాలని చూశారు. మరి ప్రదీప్ కూడా వారి బాటలోనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తి అని చెప్పి డిటో దించేస్తాడేమో అంటున్నారు.

 

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. మళ్ళీ ఈ సినిమాతో ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు అనూప్. మరి ప్రదీప్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సాంగ్స్, ప్రమోషన్స్ అన్ని సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పరిచాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే ప్రదీప్ యాంకర్ గానే కాదు హీరోగా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: