టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు చేసారు మోహన్ బాబు. హీరోగా ఆయనకు ఎంత పేరు వచ్చిందో గాని విలన్ గా మాత్రం మంచి పేరు వచ్చింది. టాలీవుడ్ లో అగ్ర హీరోలకు ఆయన విలన్ గా చేసారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో విలన్ పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్టీఆర్, అక్కినేని వంటి హీరోలకు కూడా ఆయన విలన్ గా నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన దేవత సినిమాలో ఆయన విలన్ గా నటించారు. ఆ సినిమాలో ఆయన శ్రీదేవి భర్తగా కనిపించారు. 

 

ఆ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. తనలో వైవిధ్యం చూపించారు మోహన్ బాబు. పదుల సంఖ్యలో సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు చేసారు. ఆ సినిమాల్లో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో ఆయన టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న విలన్ గా మారిపోయారు. చక్రవర్తి, జస్టీస్ చౌదరి, కొండవీటి సింహం, ఎమ్మెల్యే ధర్మరాజు సినిమాలో విలన్ గా హీరో గా నటించారు. ఎక్కువగా ఎన్టీఆర్ కి ఆయన విలన్ గా నటించారు. చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ సినిమాలో ఆయన విలన్ గా ఆకట్టుకున్నారు. 

 

చాలా సినిమాలు ఆయనకు విలన్ గానే గుర్తింపు తెచ్చి పెట్టాయి. హీరోగా కంటే విలన్ గా ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్ పక్కన ఆయన విలన్ గా చేసిన సినిమాలు అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. విలక్షణ నటుడిగా ఆకట్టుకున్న మోహన్ బాబు టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ విలన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దాదాపుగా దూరంగా ఉన్నారు. ఇక విలనిజం చూపించడం లో ఆయనది ప్రత్యేక శైలి. ఏ హీరో అయినా తడబడకుండా నటించే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: