సంపత్ రాజ్.. ఈయ‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలలో ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలలో నటించి మెప్పించారు. ఆరడుగుల రూపం, గంభీరమైన స్వరం, కళ్లలో రౌద్రం.. సంపతరాజ్‌ సొంతం. అందుకే ‘మిర్చి’ చిత్రంలో ఉమా అనే క్యారెక్టర్ సంప‌త్ రాజ్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కథ, అందులోని పాత్ర స్ట్రాంగ్‌గా ఉందా లేదా అన్నది తప్ప మరొకటి పట్టించుకోని ఈయ‌న సెలెక్టివ్‌ కథలతో టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్నారు. ఇక మిర్చి త‌ర్వాత  దమ్ము, శ్రీమంతుడు, లౌక్యం ఇలా ప‌లు చిత్రాల్లో మంచి పాత్ర‌ల‌తో చ‌క్క‌ని గుర్తింపు తెచ్చుకున్నారు.

 

ఆర్టిస్ట్‌గా ప్రూవ్‌ చేసుకోవడానికీ, సంపత్‌రాజ్‌ మంచి నటుడనిపించుకోవడానికి 19 ఏళ్లు పట్టింది. ఇక ఆయ‌న‌ టాలెంటే ఆయ‌న‌ బలం. 90 ఏళ్ల వృద్ధుడి పాత్ర చేయడానికైనా నేను రెడీ అని ఆయ‌న ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. ఇక సంప‌త్‌కు 1995లో పెళ్లయింది. 2003లో విడాకులు తీసుకొన్నారు. అయితే బహుశా తను నటుడు అవడం కోసమే అప్పుడు విడాకులు తీసుకుని ఉంటానని.. అంతా విధి రాత అని చెప్పాడు సంపత్. ఇప్పటికీ తన మాజీ భార్యకు ఇదే విషయంలో థ్యాంక్స్ కూడా చెబుతూ ఉంటా అని చెప్ప‌డం విశేషం. అంతేకాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు తన అమ్మ.. తన భార్య తరచుగా కలుస్తూ ఉంటారని.. ఆమెకు తనకు చేతనైంత సపోర్ట్ ఇస్తూ ఉంటానని చెప్పాడీ సూపర్ ట్యాలెంటెడ్ విల‌న్‌. 

 

ఇక ఈయ‌న‌కొక అమ్మాయి కూడా ఉంది. ఆమె సంప‌త్‌ దగ్గరే ఉంటుంది.  స‌పంత్ ఆమె కోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తార‌ట‌. మ‌రియు సంప‌త్‌ సినిమాలకు డేట్స్‌ ఇచ్చేముందు ఆయ‌న కూతురి స్కూల్‌ డైరీ పరిశీలించి ప్లాన్ చేసుకుంటార‌ట‌. కాగా తెలుగులో పంజా సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన సంపత్.. ఆ తర్వాత దమ్ము.. మిర్చిలతో బోలెడంత డిమాండ్ ఉన్న విలన్ గా కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. అంతకు ఎనిమిది ఏళ్ల క్రితం నుంచే తమిళ్ లో తెగ బిజీగా ఉండేవాడు సంపత్. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ స్టార్ విల‌న్‌గా స‌త్తా చూపుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: