టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విలన్స్ లో శ్రీహరి ఒకరు. అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆయన విలన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు చేసారు. ఆ సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. పవర్ ఫుల్ పాత్రలలో నటించారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు చేసారు. చిరంజీవి సినిమాల్లో, వెంకటేష్, నాగార్జున సినిమాల్లో ఆయన విలన్ గా నటించారు. వెంకటేష్ నటించిన పవిత్ర బంధం సినిమా ఆయనకు విలన్ గా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. 

 

విలన్ గా చేసినా సరే హుందాగా నటించే వారు. చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నారు. వెంకటేష్ హీరోగా వచ్చిన కలిసుందాం.. రా సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించారు. వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమాలో కూడా ఆయన విలన్ గా నటించారు. ఇలా విలన్ గా పలు సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. ఆవిడా మా ఆవిడే అనే నాగార్జున హీరోగా వచ్చిన సినిమాలో కూడా విలన్ గా మెప్పించారు. నాగార్జున హీరోగా వచ్చిన హలో బ్రదర్ లో విలన్ గా నటించారు. 

 

ఆయన విలనిజం కాస్త కొత్తగా ఉండటంతో అగ్ర దర్శకులు అందరూ ఆయన తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. పదుల సంఖ్యలో ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఆయన విలన్ పాత్రలకు మంచి డిమాండ్ ఉండేది అప్పట్లో. బాలీవుడ్ లో కూడా ఆయన విలన్ గా మెప్పించే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఆయన దాదాపు అన్ని మంచి సినిమాలే చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: