మన తెలుగు హీరోల లో చక్కగా నటించే  నేటి  హీరోలలో మన రానా దగ్గుబాటి ఒకడు . రానా దగ్గుబాటి  కొంత కాలం నుండే సినిమా కెరీర్ని ప్రారంభం చేసాడు. ఎన్నో సినిమాల లో నటించి మంచి స్థానం దక్కించుకున్నాడు. అగ్ర హీరోయిన్ల తో కూడా వివిధ  చిత్రాల లో నటించాడు హీరో రానా దగ్గుబాటి. ఈ హీరో  తన కండలు తిరిగిన దేహంతో ఎంతగానో ఆకట్టుకుంటాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో.

 

IHG

 

తన దైన నటన తో విభిన్న పాత్రల లో రానా  మంచి గెలుపుని తన ఎకౌంట్ లో వేసుకున్నాడు. తనకి తగ్గట్లు, ప్రేక్షకులు మెచ్చేట్లు ఉన్న వాటిని రానా  ఎంచుకుంటాడు.కేవలం  హీరోల క్యారక్టర్లకి పరిమితమైపోక విలన్  గా కూడా మెప్పించాడు ఈ యంగ్ హీరో. లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే  హిట్ అవ్వడం విశేషం. ఆ తర్వాత నేను నా రాక్షసి, నా ఇష్టం, ధం మరో ధం సినిమాల్లో నటించినప్పటికీ అంత విజయం అందుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ఘాజి సినిమాతో మళ్ళీ విజయ మార్గాన్న సాగాడు. ఈ సినిమాలో సబ్ మెరైన్  కి  కెప్టెన్ పాత్ర చేసి ఆకట్టుకున్నాడు. 

IHG

 


అద్భుతమైన హిట్ అందుకున్న బాహుబలి చిత్రంలో విలన్ పాత్ర పోషించి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. అంతే కాక ఇటీవలే అక్షయ కుమార్ హీరోగా నటించిన హౌస్ ఫుల్ 4 మూవీలో కూడా విలన్ గా నటించి మెప్పించాడు రానా.  అలానే మంచి కధల్లో , పాత్రల్లో  చక్కగా నటిస్తూ మంచి సినిమాని అందిస్తున్నాడు. ప్రస్తుతం అరణ్య షూటింగ్ తో బిజీగా ఉన్న రానా త్వరలో తెరపైకి రానున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: