విలన్ గా ఇతను ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు .తెలుగు లో అనేక సినిమాలు చేసి సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. తమిళనాడు లో  పుట్టి తెలుగు తెర మీద తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులని  కూడా మెప్పించాడు. కేవలం నటుడిగా మాత్రమే కాక నాజర్ నిర్మాతగా, దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. అలానే ఒక్క మన సినిమాలలో మాత్రమే కాక తమిళ్, మలయాళం లో కూడా నటించాడు. దేశాలు దాటి  అటు హాలీవుడ్ లో క్విక్ గన్ మురుగన్ సినిమా కూడా చేసాడు నాజర్. 

 

 

దూకుడు, శక్తి, మోక్ష, ఖలేజా, వరుడు, శ్రీరామదాసు, అతడు, పోకిరి, బాహుబలి, సాయి, సింహాద్రి, ఆంధ్రావాలా, మిస్టర్ పర్ఫెక్ట్, కొమరం పులి, వెంకీ మామ, బాద్షా,బావ, అదుర్స్, కొరియర్ బాయ్ కళ్యాణ్ ఇలా తెలుగులో విభిన్న సినిమాలలో చేసి ఎంతగానో అక్కట్లున్నాడు. 1977 లో అవకాశాలు కోసం మద్రాసు వెళ్ళాడు. హోటల్ లో నాజర్ పని చేసేవాడు. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి.1993 లో వచ్చిన మాతృదేవోభవ, 1995 లో వచ్చిన బాంబే, 2005 లో వచ్చిన అతడు సినిమాలలో అద్వితీయమైన నటనని ప్రదర్శించాడు. చంటి సినిమాకి గాను ఉత్తమ ప్రతి నాయకుడిగా నంది పురస్కారం  లభించింది.  

 

 

బాహుబలిలో అవిటివాని పాత్రలో కనిపించాడు నాజర్. బిచ్చలదేవ పాత్రతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించాడు. స్వతహాగా తమిళుడు అయినప్పటికీ తెలుగులో తాను నటించిన సినిమాలకి తానే స్వయంగా  డబ్బింగ్ చెప్పుకునేవాడు నాజర్.మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో విలన్ పాత్రని చేసి మెప్పించాడు .ఇలా పలు సినిమాలలో అనేక రక్షల పాత్రలని చేసి ఆకట్టుకున్నాడు నాజర్. దమ్ము సినిమాలో కూడా విలన్ పాత్ర చేసాడు. ఒక్క విలన్ గా మాత్రమే కాకా తండ్రిగా, తాతగా అనేక పాత్రలు పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: