నేచ‌ర‌ల్ స్టార్ నాని అస్టాచెమ్మా చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. న‌ట‌న‌లో త‌న‌దైన శైలితో చాలా నేచ‌ర‌ల్‌గా న‌టిస్తాడు నాని. నాని ఎప్పుడూ కూడా త‌న పాత్ర‌ల‌న్నీ ఏదో మ‌న ప‌క్కింట్లో చూసిన అబ్బాయిలాగా మ‌న ఇంట్లో చూసిన వాడిలాగా ఉంటాయి. త‌ప్పించి ఎవ‌రో ఒక కొత్త పాత్ర‌ని చూస్తున్న‌ట్లు అనిపించ‌దు. దాంతో నాని చాలా త్వ‌ర‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యార‌ని చెప్పాలి. ఎన్నో ల‌వ్‌స్టోరీస్, కుటుంబ‌క‌థా చిత్రాల్లో న‌టిస్తూ మెప్పిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో సినిమాల్లో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా ఆయ‌న నిర్మాత‌గా మారి కొన్ని చిత్రాల‌ను నిర్మిస్తున్నారు కూడా. అ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసి అందులో చేప పాత్ర‌కి ఆయ‌న వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా అనిపించింది. 

 

ఈగ‌, నేనులోక‌ల్‌, జ‌ర్సీ,గ్యాంగ్ లీడ‌ర్ ఇలా డిఫ‌రెంట్ పాత్ర‌ల‌లో న‌టిస్తూ హీరోగా త‌న కెరియ‌ర్‌ని కొన‌సాగిస్తున్నారు. అయితే ఇటీవ‌లె విడుద‌లైన గ్యాంగ్‌లీడ‌ర్ మాత్రం కాస్త ఆశించ‌నంత ఫ‌లితం రాలేదు. ఇక ఇప్పుడు ఈ నేచుర‌ల్ స్టార్ ఆయ‌న కొత్త కొణం చూపించ‌నున్నారు. అదేంటి అనుకుంటున్నారా.. నాని విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. `వి` అనే చిత్రం ద్వారా ఆయ‌న విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అందులో సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ పోస్టర్‌కి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. ఇక ట్రైల‌ర్‌లో ఆయ‌న చెప్పే డైలాగ్స్ చాలా హైలెట్‌గా నిలిచాయి. హీరోగానే కాకుండా ఈ నేచ‌ర‌ల్ స్టార్ విల‌న్‌గా కూడా త‌న న‌ట‌న నేచ‌ర‌ల్‌గానే ఉంటుంద‌ని చాటి చెపుతున్నారు.

 

ఇక ట్ర‌యిల‌ర్‌లో ఆయ‌న చెప్పే డైలాగ్స్‌కి ప్రేక్షులు విజిల్స్ వేస్తున్నారు. అంత‌బాగా ఆయ‌న మాడ్యులేష‌న్ కుదిరింద‌ని చెప్పాలి. ఈ చిత్రంలో సుధీర్‌బాబు పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఆయ‌న‌కి ధీటుగా నాని చెప్పే డైలాగ్స్ అదుర్స్ అని చెప్పాలి. క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల ఈ చిత్రం  ‘వి’ మూవీని వాయిదా వేస్తున్న‌ట్టు తెలిపింది చిత్ర యూనిట్. మార్చి 25న  ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌న్నాహాలు  చేశారు. కోవిడ్ 19 కార‌ణంగా మూవీని ఏప్రిల్‌కి వాయిదా వేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విష‌యం పై అటు నాని కూడా కాస్త అప్‌సెట్ అయిన‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: