గోపీచంద్ చక్కని నటుడు. అనేక చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తొలివలపు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. రణం, యజ్ఞం ఇలా ఎన్నో సినిమాలలో నటించాడు గోపీచంద్. ఇతను దర్శకుడు టి. కృష్ణ కొడుకు. అయితే గోపీచంద్ చదువుకుంటూ మాదాల రంగారావు పిల్లలు రష్యాలో ఉంటే వారితో పాటు గోపీచంద్ కూడా పార్ట్ టైం ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత సినిమాల వైపు ఆసక్తి కలిగింది హీరో గోపిచంద్ కి. 

 

IHG

 

మొదట గోపీచంద్ చదువు పూర్తి కాగానే వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు,ఆ తర్వాత తన అన్నయ మరణించాడు. అయితే ఎంతో కాలంగా దర్శకుడు కావాలని అన్న ప్రేమ్ చంద్ అనుకుని కష్టపడుతూ అప్పుడే దర్శకుడుగా వచ్చి మరణించాడు. అందుకే తండ్రి వారసత్వంలో ఎవరైనా చెయ్యా లని అనుకున్నాడు గోపీచంద్. సినిమా రంగంలో ఉండాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకే ఇప్పుడు హీరో అయ్యాడు. అయితే మొదట తన తండ్రి స్నేహితులు అయిన నాగేశ్వర రావు, తిరుపతి రావు, హనుమంతరావు కలిసి గోపీచంద్ హీరోగా చిత్రాన్ని తీశారు. ఆ చిత్రానికి ముత్యాల సుబ్బారావు దర్శకత్వం వహించాడు. అదే తొలివలపు చిత్రం. ఇదే తన మొదటి సినిమా. 

 

IHG

 

తొలివలపు, జయం, ఆంధ్రుడు, రణం, రారాజు, ఒక్కడున్నాడు, లక్ష్యం, ఒంటరి, శంఖం, గోలీమార్ , వాంటెడ్, మొగుడు, సాహసం, లముఖ్యం, జిల్, పంతం, ఆరడుగుల బులెట్ ఇలా ఎన్నో సినిమాలలో గోపీచంద్ నటించాడు. హీరోగా ఇప్పుడు వస్తున్న గోపీచంద్ ప్రతి నాయక పాత్రలో కూడా నటించాడు. హీరో ప్రభాస్ వర్షం సినిమాలో ప్రతి నాయక పాత్రలో నటించి మెప్పించాడు. అలానే నితిన్ హీరోగా చేసిన జయం సినిమాలో కూడా ప్రతి నాయక పాత్ర చేసాడు ఈ హీరో. అటు విలన్ గా  ఇటు హీరోగా కూడా ఎంత మాత్రం తగ్గలేదు, రెండింటిలో కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు ఈ హీరో. 

మరింత సమాచారం తెలుసుకోండి: