టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోయిన్లు వరుసగా ఎంట్రీ ఇస్తున్నారు.  ఇందులో కొంత మంది మాత్రమే సక్సెస్ సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ హీరోయిన్లు గ్లామర్, స్కిన్ షో తో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే.  ఇక టాలీవుడ్ లో దర్శకత్వం మాత్రమే మాకుండా నిర్మాతగా సత్తా చాటుతున్నాడు సుకుమార్.  సినీ పరిశ్రమలో సుకుమార్ అంటే ఓ ప్రత్యేక ఉంది. ఆ మద్య రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం మూవీ బాక్సాఫీస్ హిట్ అయ్యింది.  1983 నాటి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్ ని డిఫరెంట్ లుక్ లో చూపించారు. 

 

ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతుందట. ఇందులో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ మూవీలో బన్నీని మరో డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నారట సుకుమార్.  తాజాగా నాగశౌర్య కథానాయకుడిగా కాశీ విశాల్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటి వరకు ఎన్నో చర్చలు జరిగాయట.  ఓ అందమైన ముద్దుగుమ్మను చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఈ సినిమాలో కథానాయికగా ఎవరైతే బాగుంటారా అనే విషయంలో  మొత్తానికి ఓ హీరోయిన్ ని సెలెక్ట్ చేశారట. చివరికి కేతిక శర్మను కథానాయికగా ఎంపిక చేశారనేది తాజా సమాచారం.  అయితే ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటిస్తునన ‘రొమాంటిక్' సినిమా ద్వారా కేతిక శర్మ పరిచయమవుతోంది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకమునుపే, ఆమె సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం. ఈ మూవీ సక్సెస్ అయితే కేతిక శర్మకు తెలుగు లో మంచి అవకాశాలు రొవొచ్చు అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: