ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పడడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఇక దీనిపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను కలిశారు. ఇక వీరిద్దరి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జెసి దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాలా తెలివైన వాడని... జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ చాలా మటుకు తగ్గింది వ్యాఖ్యానించారు. అయితే తాము ప్రతిపక్ష పార్టీలో ఉన్నంత మాత్రాన అన్ని విషయాల్లో విమర్శలు చేయాలి అని లేదని... మంచి పనులు చేస్తే ప్రోత్సహించాలి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించదగ్గ విషయమే అంటూ జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

 

 

 ఇదే సమయంలో జగన్ సర్కార్ పై విమర్శలు కూడా చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం కానీ గవర్నర్ కానీ ఉండకూడదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారని.. రాష్ట్రంలో  బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా  కేవలం జగన్ ఒక్కడే ఉండాలి అని... ఇక జగన్ పక్కన పోలీసులు ఉంటే సరిపోతుంది అనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు జేసి దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నారని... రోజురోజుకు తన నెత్తి మీద  తానే న చేయి పెట్టుకుంటున్నారు అంటూ జేసీ జగన్ పై విమర్శలు చేశారు. అధికార వైసిపి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు సృష్టించిన నామినేషన్లు వేశాము అంటూ తెలిపిన జెసి దివాకర్ రెడ్డి.... ఇంకా పోలింగ్ రోజున కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు పోలీసులు కనీసం పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను అయినా   కూర్చొనిస్తారా లేదా అనేది కూడా అనుమానంగానే మారింది ఎంతో తెలిపారు. 

 

 

 లేకపోతే అందరి ఓట్లు వాళ్లే వేసుకుంటారేమో అంటూ వ్యాఖ్యానించారు టీడీపీ  కీలక నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అయితే జగన్ సర్కార్ కు  పోలీసులు ఎంతగానో భయపడుతున్నారని... ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూతుల్లో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని తాను తాజా సమావేశంలో కోరినట్లు జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సమావేశమైనట్లు జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలకు ఎన్నికల సంఘం దగ్గర డబ్బులు లేకపోతే టిడిపి పార్టీ దగ్గర ఉన్నాయని ఇస్తాము అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఎన్నికల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవు అంటూ  ఈ సందర్భంగా జేసీ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: