అల్లు అయాన్ కు చదువు చెబుతున్న టీచర్లకు అయాన్ తల్లిదండ్రులయిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, స్నేహ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. అల్లు అయాన్ బోధీ స్కూల్‌ లో ప్రీ స్కూల్ పూర్తి చేసుకున్నాడు. అల్లు అర్జున్ తన కొడుకు అల్లు అయాన్ తో పాటు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి, చదువులో తీర్చిదిద్దారని ఆ స్కూల్ టీచర్స్ ను కొనియాడారు. అయాన్ మంచి విద్యాబుద్ధుల్ని నెర్చుకున్నాడని అయాన్ కు సహకరించిన ఉపాధ్యాయులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. 


కాగా., స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించిన అలా వైకుంఠపురంలో సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించి.. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ విషయం విదితమే. కానీ.. ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించిన సినిమాలు అన్నిటిలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కుదిపేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది ఈ సినిమా.


ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తన తరువాత సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోందని సినీ వర్గాలు అంటున్నాయి. కాగా., ఈ సినిమాకి ‘శేషాచలం’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు వినబడుతోంది. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ శేషాచలం అనే లారీ డ్రైవర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా పూర్తి యాక్షన్ క్రైమ్‌ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో చాలా అంచనాలే ఉన్నాయి. కానీ.. తాజాగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ను రద్దు చేస్తిన్నట్లు సమాచారం. అల్లాగే ఈ సినిమాతో పాటు దాదాపు అన్ని సినిమా షూటింగ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: