యాంకర్ విష్ణు ప్రియ.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఆక‌ట్టుకునే అందం.. గ‌ల‌గ‌లా మాట్లాడే త‌న వాక్చాతుర్యంతో త‌క్కువ కాలంలో బాగా పాపుల‌ర్ అయింది విష్ణు ప్రియ. బుల్లితెరపై ఇప్పటికే యాంకర్ అనసూయ, ర‌ష్మీ దూసుకెళ్తున్నారు. అలాగే వీరు వెండితెరపై కూడా రాణిస్తున్నారు. అది వేరే విష‌యం అనుకోండి. అయితే ఇప్పుడు ఈ స్టార్ యాంకర్స్ కి పోటీ ఇస్తుంది విష్ణు ప్రియా. `పోవే.. పోరా` ప్రోగ్రామ్ ద్వారా త‌న మాట‌ల‌తో న‌వ్విస్తూ.. త‌న చ‌ల‌కీత‌నంతో క‌వ్విస్తోంది ఈ భామ‌.

IHG

ఈ షోలో సుడిగాలి సుదీర్‌తో పాటు విష్ణు దుమ్ము దులిపేస్తోంది. ఇక మొదటిసారి ఈ ప్రోగ్రాం ద్వారానే యాంకర్ గా జీవితం ఆరంభించి ప్రేక్షకులకు దగ్గరైంది విష్ణుప్రియ. అంతకుముందు ఈమె ఎవరో కూడా ఎవ్వరికి తెలియదు. కానీ ఈ ప్రొగ్రాం కంటే ముందు షార్ట్ ఫిల్స్, వెబ్ సిరీస్ లో విష్ణు ప్రియ నటించింది. కానీ ఆమె టాలెంట్ ను ఎవ్వరూ గుర్తించలేదు. 

IHG

అలాంటి విష్ణు ప్రియ పోవేపోరా ప్రొగ్రాంతో చలాకీ మాటతీరు.. అదిరిపోయే పంచులు, కుర్రకారు మెచ్చేలా డ్రెస్సింగ్, చేష్టలతో పిచ్చెక్కించింది. మ‌రియు తనదైన స్టైల్లో హావభావాలు పలికిస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది. పోవే.. పోరా షోనే కాకుండా.. మ‌రిన్ని షోలలో కూడా తన సత్తా చూపిస్తుంది ఈమె. ఇక ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నే విష్ణు ప్రియపై ఒక కామన్ కామెంట్ ఉంటుంది. అది ఆమె ముక్కుపై. విష్ణు ప్రియ ముక్కు కాస్త పెద్దదిగా ఉండటంతో కామెడీని పండించడానికి అంతా దాన్నే టార్గెట్ చేస్తున్నారు. 

IHG

నిజానికి విష్ణు ప్రియ అందానికి ఫిదా అయిపోయే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు పర్సనల్ లైఫ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది విష్ణు ప్రియ. బయటికి వెళ్లి.. అక్కడ్నుంచి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో కాక రేపుతుంటుంది. తాజాగా అలాంటి ఫొటోలే కొన్ని పోస్ట్ చేసింది. నాభి అందాలను ప్రదర్శిస్తూ వెరైటీ చీర‌లో విష్ణు ప్రియ అదరగొట్టింది. నిజంగా ఈ ఫోటోలు చూస్తుంటే.. విష్ణు ప్రియ ఇంత హాట్‌గా ఉందేంటి అన‌క మాన‌రు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: