మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీలో నటించాడు.  ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించాడు.  ఆ మూవీ బ్రిటీష్ వారిని ఎదిరించిన మొట్టమొదటి తెలుగు యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.  పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినప్పటికే పెద్దగా సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో' ఆచార్య' పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నట్లే వార్తలు వచ్చాయి..'స్టాలిన్' తరువాత ఈ జంటను చూడటానికి అభిమానులు ఆసక్తిని చూపారు.  కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.  

 

ఆమె స్థానంలో  'ఖైదీ నెంబర్ 150' సినిమాలో చిరు సరసన నటించిన కాజల్ పేరు వినిపించింది. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.  తాజాగా తెరపైకి బొమ్మళి అనుష్క పేరు వినిపిస్తుంది. గతంలో అనుష్క మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్‌లో చిరంజీవి సరసన ఓ పాటలో మెరిసిన సంగతి తెలిసిందే. చిరంజీవి జోడీగా ఆమె పాత్ర పరంగా అనుష్క అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించి ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

 

గతంలో కొరటాల దర్శకత్వంలో మిర్చి మూవీలో నటించింది అనుష్క.  ఈ మూవీ ప్రభాస్, అనుష్క కి బాగా కలిసి వచ్చింది. ఈ పరిచయంతోనే కొరటాల శివతో మరోసారి నటించేందుకు అనుష్క అంగీకరించబోతున్నట్లు టాలీవుడ్ టాక్. చాలా రోజుల తర్వాత చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఆచార్యను ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. రెజీనా కాసాండ్రా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: