ఎన్నడూ లేని విధంగా ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా అక్కడ కాస్త కంట్రోల్ కి వచ్చినా.. ఇప్పుడు ప్రపంచం మొత్తం చుట్టుకుంది.  ఎక్కడ చూసినా ఇప్పుడు కరోనా వల్ల మరణాలు సంబవిస్తున్నాయని అంటున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనాకు ఇప్పటి వరకు సరైన యాంటీ డోస్ కనుగొనలేదు.  దాంతో ఇప్పుడు అందరూ ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని.. ముఖానికి మాస్క్ దరించాలని.. చేతులు శుభ్రం చేసుకోవాలని.. చేతులు ముఖంపై పెట్టుకోవొద్దని ఇలాంటి జాగ్రతలు మాత్రమే చెప్పుకుంటున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్యులు ఈ సూచనలే చెబుతున్నారు.

 

అయితే కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు.. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు కరోనాని దగ్గరకు రాకుండా చూసుకోవచ్చు అంటూ సెలబ్రెటీలు కొన్నివీడియోలు చేసి పంపుతున్న విషయంతెలిసిందే. తాజాగా యాంకర్ సుమ ఇప్పటికే కరోనా పై కొన్ని వీడియోలు చేసింది. తాజాగా తన చేతులు శుభ్ర చేసుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'కరోనా వైరస్‌ నుంచి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో చెప్పడానికి ఈ వీడియోలో చూపెడుతున్నాను. నేనయితే ప్రతిరోజు శానిటైజర్‌ వాడుతున్నాను. లేకపోతే చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నాను' అని తెలిపింది.

 

కరోనా అంటూ ఎంతో మంది భయపెట్టిస్తున్నారు.. అలా భయపడాల్సిన అవసరం లేదు..  కడుక్కోకుండా చేతులతో ముఖాన్ని టచ్‌ చేయొద్దు. ఒకవేళ దగ్గు, జబులు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే వారికి దూరంగా ఉండాలి. వారిని వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పాలి' అని సూచించింది. కరోనా వల్ల ఇప్పటికే భారత్ లో ఇద్దరు మరణించారు.. 80 కి పైగా కేసులు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనాను మన దరికి రాకుండా బాధ్యతగా శుభ్రతను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: