ఈ మధ్య ఏ స్టార్ హీరో అయినా సరే ప్రేక్షకుల ఇష్టం ఆధారంగానే సినిమాలు చేస్తున్నాడు. గతంలో హీరోలు ఒక ట్రెండ్ సెట్ చేసి దానిని అభిమానుల మీద రుద్దే వాళ్ళు. అది కొందరి హీరోల విషయంలో విజయవంతం అయితే మరికొందరు హీరోల విషయంలో ఘోరంగా ఫ్లాప్ అయింది అనే మాట అక్షరాలా నిజం. ఇప్పుడు కాస్త రూటు మార్చారు హీరోలు. ప్రేక్షకులు ఏది కోరుకుంటున్నారో దానిని ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక స్టార్ హీరోలు అయితే దీనిని ఈ మధ్య కాలంలో ఎక్కువగానే ఫాలో అవుతున్నారు. 

 

తాజాగా అల్లు అర్జున్ కూడా ఆ కోవలోకి వచ్చేసాడు అనేది అర్ధమవుతుంది. అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ కాస్త జోష్ లో ఉన్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ వేగంగా సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాస్తవం. అతని సినిమాలకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఆదరణ పెరిగింది అనేది వాస్తవం. అందుకే ఇప్పుడు అతను కాస్త కొత్తగా కనపడే ప్రయత్నం చేస్తున్నాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది. 

 

సినిమా విషయంలో కాస్త కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 12 కేజీల వరకు అతను బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకోసం కాస్త గట్టిగా కష్టపడుతున్నాడు. నిపుణుల సలహాలను తీసుకుని అతను బరువు పెరుగుతున్నాడు. త్వరలోనే అతని లుక్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఈ లుక్ లో అతను కాస్త మొరటుగా కనపడే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: