టాలీవుడ్ లో ఇప్పుడు బాలకృష్ణ క్రేజ్ అనేది కాస్త తగ్గింది అనే మాట వాస్తవం. టాలీవుడ్ లో ఒకప్పుడు బాలకృష్ణ అగ్ర హీరోగా ఉన్నారు. కాని క్రమంగా ఆయన సినిమాల ఫ్లాప్ అవ్వడంతో అభిమానులు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమాల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా చెప్పుకోదగిన విజయం లేదు. దీనితో ఆయనతో సినిమాలు చేయడానికి పెద్దగా దర్శక నిర్మాతలు కూడా ముందుకి రావడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇటీవల ఆయన నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

 

దీనితో ఇప్పుడు ఆయన క్రేజ్ అమాంతంగా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీను  దర్శకత్వంలో చేస్తున్న సినిమాను వేగంగా పూర్తి చెయ్యాలని ఇబ్బంది పెడుతున్నాడు. దీనికి కారణం ఏంటో తెలియదు గాని ప్రస్తుతం బాలయ్య మాత్రం ఇతర దర్శకులతో సినిమాలను కూడా వేగంగా పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో ఉండాలని ఆయన భావిస్తున్నారట. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలకు క్రేజ్ తగ్గింది కాబట్టి... ఆయన కూడా సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు అంటున్నారు. 

 

త్వరలో ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ సినిమా పూర్తి అయితే బాలకృష్ణ... ఇక సినిమాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం బోయపాటి తో చేస్తున్న సినిమా వేసవిలో విడుదల అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమా విడుదల కాగానే మరో సినిమాను మొదలుపెట్టేస్తారు ఏ గ్యాప్ లేకుండా చెయ్యాలని చూస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా గా నటిస్తున్నారు అంటున్నారు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా ఆయన నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: