నేచురల్ స్టార్ నానీ... అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. సహాయ దర్శకుడిగా అడుగు పెట్టిన అతను... ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుత౦ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న హీరోల్లో అతను కూడా ఒకడు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటుగా మాస్ ఆడియన్స్ ని కూడా తన వైపుకి తిప్పుకున్నాడు ఈ యువ హీరో. వరుస విజయాలతో ఒకప్పుడు టాలీవుడ్ లో తన సత్తా చాటాడు ఈ హీరో.

 

అయితే అతను మాత్రం ఇప్పుడు ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. అతని కెరీర్ లో 50 లక్షల నుంచి ఇప్పుడు దాదాపు 10 కోట్లకు పైగా అతను వసూలు చేసే స్థాయికి వెళ్ళాడు. ఈ మధ్య కాలంలో అతని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో నిర్మాతలు అతనికి పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా అతనితో సినిమా చెయ్యాలి అనుకున్న నిర్మాతలు డ్రాప్ అవుతున్నారు. దానికి కారణం అతను ఇప్పుడు భారీగా రేట్ పెంచడమే అంటున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో పాటుగా అతను పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు. 

 

మొన్నీ మధ్య ఇలాగే పెంచితే అవసరం లేదని నిర్మాతలు అందరూ ఒక అంగీకారానికి రావడం తో అతను వెనక్కు తగ్గాడు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి రేటు పెంచడంతో నిర్మాతలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే దర్శకులు కూడా నానీ తో సినిమా అనగానే అవసరం లేదు అనే భావనకు వచ్చేసినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అతని సినిమాలు ఫ్లాప్ అయితే ఎలాగూ సినిమాకు ముందు భారీ మార్కెట్ కూడా ఉండే అవకాశం లేదు అని కాబట్టి తేడా వస్తే మునిగిపోవడం ఖాయమనే భావనకు నిర్మాతలు వచ్చేశారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: