ఒక పక్క డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న త్రివిక్రమ్ మరోపక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ అంటూ తన కథలను వేరే దర్శకుల చేతుల్లో పెట్టి సినిమాలు నిర్మించి హిట్టు కొడుతున్నాడు. కుమారి 21f సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.  ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ నుండి దర్శకుడు సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక లేటెస్ట్ గా సుకుమార్ మరో సినిమాకు నిర్మాణ సహకారం అందిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను బుచ్చి బాబు డైరెక్ట్ చేస్తున్నారు. 

 

ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా సుకుమార్  సొంత నిర్మాణంలో హ్యాట్రిక్ మూవీగా ఒక సినిమా వస్తుంది. కుమారి 21f సినిమా దర్శకుడు సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ అంటూ ఒక సినిమా మొదలైంది. నిఖిల్ హీరోగా తెరకెక్కే ఈ సినిమా రీసెంట్ గా ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడట సుకుమార్. 

 

ఉప్పెనలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్ చూసి నచ్చిన సుకుమార్ ఆమెకు వెంటనే సెకండ్ ఛాన్స్ ఇచ్చాడట. ఉప్పెన రిలీజ్ అవకముందే అమ్మడికి రెండో ఛాన్స్ కూడా వచ్చేసింది. ఉప్పెన హిట్ అయితే ఇక ఆ హీరోయిన్ కి వరుస అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. 18 పేజెస్ కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. కృతి శెట్టి ఫామ్ చూస్తుంటే తెలుగులో కొన్నాళ్ళు హవా కొనసాగించేలా ఉంది. సుకుమార్ దృష్టిలో పడ్డది అంటే అమ్మడి ఫేట్ మారినట్టే. ఇక వరుస ఛాన్సులు వస్తే అమ్మడు అదరగొట్టడం ఖాయం. కృతి సనన్, కృతి కర్బందా ఇద్దరు కృతిలు తెలుగులో క్లిక్ అవలేదు మరి ఈ కృతి అయినా అలరిస్తుందా లేదా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: