కొన్ని కొన్ని సినిమాల్లో విలన్స్ ఉంటారు... కానీ వాళ్ళు విలన్స్ అని చివరి వరుకు మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు అందరికి మంచివాళ్ళలా కనిపిస్తారు.. కానీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని మనకు చివరకు తెలుస్తుంది. వాళ్ళు మొదటి నుండి ఎంతో మంచివాళ్ళగా నటించి వాళ్ళే హీరోల వెనుక గోతులు తొవ్వుతున్నారు అని చివరికి తెలుస్తుంది. అలా ఏ సినిమాల్లో ఏ హీరోలు నటించారు.. ఎం చేశారు అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

రంగస్థలంలో 'ప్రకాష్ రాజ్'.. 

 

సినిమా అంత అతను ఓ గొప్పోడిగా కనిపిస్తాడు.. కానీ చివరికి చిట్టిబాబు చెప్పినప్పుడు అర్థం అవుతుంది. ఆ సినిమాకు ఆ ప్రకాష్ రాజ్ ఏ పెద్ద విలన్ అని. ఆ ఒక్క సినిమాలోనే కాదు మరో సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ అలానే నటించాడు.. ఆ సినిమానే ''భారత్ అనే నేను''. ఆ సినిమాలో హీరో మహేష్ నాన్నకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తాడు.  

 

గూఢచారిలో 'వెన్నెల కిషోర్'.. 

 

ఎప్పుడు అందరిని నవ్విస్తూ.. నవ్వుతు ఉండే వెన్నెల కిషోర్.. ఓ సినిమాలో మాత్రం విలన్ క్యారెక్టర్ చేశాడు. ఆ సినిమాలో వెన్నెల కిషోర్ విలన్ అని సినిమా అయిపోయే వరుకు తెలియదు అంటే నమ్మండి. వెన్నెల కిషోర్ విలన్ అని తెలిసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. అలా ఇచ్చాడు మరి అడవి శేష్. 

 

ఆర్ఎక్స్ 100 'పాయల్ రాజపుత్'...  

 

అబ్బా అబ్బా.. ఆ సినిమాలో హీరో హీరోయిన్లు అదరహో అనే రొమాన్స్ చేశారు. అసలు చెప్పాలి అంటే.. ఆ సినిమాలో రొమాన్స్ చేసిన విధానం చూసి హీరోయిన్ కి హీరో అంటే ఎంతో ఇష్టం.. ప్రాణం అని అనుకుంటారు.. కానీ చివరికి తెలుస్తుంది.. ఆ హీరోయిన్ ది పెద్ద కంత్రి క్యారెక్టర్ అని.. ఆ సినిమాకు పాయల్ ఏ పెద్ద విలన్ అని తెలిసిన ప్రేక్షకులు షాక్ అయిపోతారు అంటే నమ్మండి. 

ఇలా.. మొదట మంచిగా.. మెయిన్ లీడ్ గా నటించి చివరికి విలన్స్ అయ్యి సినిమాలను సూపర్ హిట్ చేశారు అంటే నమ్మండి.. ఈ సినిమాలు మళ్ళి మళ్లీ చూడాలి అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: