తెలుగు బుల్లితెరపై ‘జబర్ధస్త్’ కార్యక్రమంలో బాగా పాపులర్ అయిన నటుడు ధన్ రాజ్.  తర్వాత వెండితెరపై అడుగు పెట్టాడు.  ఆ మద్య బిగ్ బాస్ లో కనిపించి సందడి చేశాడు. తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 1 లో ధన్ రాజ్ దుమ్మురేపాడు.  తెలుగు లో కమెడియన్ గా రాణిస్తున్న దన్ రాజ్ ఈ మద్య నాగబాబు జడ్జీగా వ్యవహరిస్తున్న ‘అదిరింది’ లో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధన్ రాజ్ మాట్లాడుతూ..  మా నాన్నగారిది తాడేపల్లి గూడెం .. మా అమ్మగారిది హనుమాన్ జంక్షన్. నేను పుట్టింది తాడేపల్లిగూడెంలోనే.  మా నాన్న లారీ డ్రైవర్ గా పనిచేశారు.

 

అప్పుడు నాకు నాలుగేళ్లు మా నాన్నయాక్సిడెంట్ లో చనిపోయాడు.  ఆయన చనిపోయిన విషయం కూడా నాకు అంతగా జ్ఞాపకం లేదు. అయితే చిన్నప్పటి నుంచి పోస్టర్లు చూస్తూ సినిమాలంటే ఎంతో మోజు పెంచుకున్నాను.  అప్పుడు పదోతరగతి చదువుతున్నా.. నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ తో చిన్నప్పుడే పారిపోయి వచ్చాను.   ఆ తరువాత నన్ను వెతుక్కుంటూ మా అమ్మ ఇక్కడికి వచ్చింది. నా ఇష్టం ఏమిటో తెలుసుకుని దానిని నెరవేర్చడం కోసం తను కష్టపడింది. నిజంగా మా అమ్మ త్యాగం.. ఎంతో గొప్పది.. నేను కష్టాలు పడుతున్న సమయంలో నా భుజం తట్టి ధైర్యం చెప్పేది. అయితే సినిమాల్లో ఛాన్సు అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.. ఎన్నో కష్టాలు పడాలి.. కన్నీళ్లు దిగమింగుకోవాలి. 

 

అదృష్టం ఉంటే ఛాన్స్ లేదంటే వేస్ట్ అనే పరిస్థితి ఉంటుంది.  అలా ఎన్నో కష్టాలుపడుతూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాను. మొదట షార్ట్ ఫిలిమ్ లోనటించాను.. తర్వాత అదృష్టం కలిసి వచ్చి జబర్ధస్త్ లో నటించాను. తర్వాత సినిమాల్లో ఛాన్సు రావడం జరిగింది.  ఈ రోజున నేను ఈ స్థాయిలో వున్నాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: