బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎవరికైనా సరదానే. కేక్ కటింగ్, నైట్ పార్టీ, డిస్కో.. ఇలా ఓ రేంజ్ లో ఉంటుంది. హీరోయిన్స్ అయితే చెప్పేదేముంది.. ఫ్రెండ్స్ తో సంబరాలు చేసుకుంటారు. పబ్, వైన్, డిస్కో, కేక్, పాటలతో కేరింతలు,, ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వారు తమదైన రోజున ఎంజాయ్ చేస్తారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రీసెంట్ గా జరిగిన తన బర్త్ డే వేడుకలను ఇలానే తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది.

 

 

మార్చి 15న ఈ అందాల భామ పుట్టినరోజు. దీంతో తన ఫ్రెండ్స్ తో గ్రాండ్ పార్టీ సెట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది. తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన క్లిప్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తన సోదరి షహీన్ భట్ కూడా ఉంది.  ఇక్కడ విశేషమేమంటే వారంతా బర్త్ డే ఎంజాయ్ మెంట్ లో ఓ ఇంగ్లీష్ సాంగ్ కి తమ చేతి వేళ్లతో సైగల్లాంటి ఎక్స్ ప్రెషన్స్ చేస్తూ మిడిల్ ఫింగర్ చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి వారంతా ఎవరిని ఉద్దేశించి తమ మిడ్ ఫింగర్ చూపించారో కానీ దీనిపై నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వస్తున్నాయి.

 

 

'ఇదేనా బర్త్ డే పార్టీ' అని కూడా రాసుకుంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ పార్టీ ఎక్కడ జరిగిందో తెలీలేదు కానీ.. చూస్తుంటే అమ్మడు బర్త్ డే సెలబ్రేషన్స్ ను గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టుంది. అసలే నలుగురు ముద్దుగుమ్మలు ఉండటంతో విమర్శలు, విపరీతార్ధాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ప్రస్తుతం అలియా భట్ ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

for life .. 👊🤙🤞 (how I spent my birthday)

A post shared by alia ☀️ (@aliaabhatt) on

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: