సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం ఆది నుంచి వస్తున్నదే. హీరోల కొడుకు కూతుళ్ళు, అలాగే హీరోయిన్స్ కొడుకు కూతుళ్ళు, దర్శక, నిర్మాతల పిల్లలు ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్స్ గా సత్తా చాటాలని స్టార్ స్టేటస్ ని దక్కించుకోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే తల్లి దండ్రుల నేం ని ఫేం ని ఉపయోగించుకొని స్టార్స్ అయినవాళ్ళు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాగే మరో వారసురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. కోలీవుడ్ లో తన లక్ ని చెక్ చేసుకుంటుంది. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన నటిస్తున్న సినిమాతో ఎలాంటి సక్సస్ ని అందుకుంటుందో చూడాలి.

 

మాళవిక మోహనన్ అంటే ఎవరో నిన్నటి వరకు సినిమా ఇండస్ట్రీకి తెలీదు. అలాంటిది ఒక్కసారిగా సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ గురించి చర్చ మొదలైందంటే ఈ అమ్మడు ఎంతగా అట్రాక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కూతురే మాళవిక మోహనన్ అన్న విషయం చాలా మందికి తెలీదు. మరి సడన్ గా వైరల్ ఎందుకయ్యింది.. అంటే తమిళ ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న "మాస్టర్" సినిమా పోస్టర్ లో ఆయన పక్కన కనిపించడం వల్ల. ఇటీవలే మాస్టర్ సినిమా టీం విజయ్ తో మాళవిక ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసింది.

 

అప్పటివరకు ఎవరికీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయం తెలీదు. ఒక్కసారిగా దళపతి విజయ్ పక్కన కనపడే సరికి అందరి కళ్ళు మాళవిక మోహనన్ మీదే పడ్డాయి. అప్పటి నుండి మాళవిక మోహనన్ ఎవరూ అంటూ ఆరా మొదలైంది.  మాళవిక మోహనన్ మలయాళ నటి. ఒకటి రెండు హిందీ తమిళంలో చేసినా పాపులర్ కాలేదు. కానీ మాస్టర్ సినిమాలో తన పోస్టర్ రిలీజ్ చేసేసరికి మాళవిక మోహనన్ ఆనందానికి అవధులు లేవు. అదీగాక విజయ్ విజయ్ సేతుపతి లాంటి సూపర్ స్టార్లతో లీడింగ్ రోల్ లో నటించడం విశేషం. త్వరలోనే మాళవిక మోహనన్ కి ఒక భారీ సక్సస్ రాబోతుందని అందరూ అంటున్నారు. మరి ఈ బ్యూటి కోలీవుడ్ లో సక్సస్ అవుతుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: