అనుష్క సినిమాలు తక్కువ చేస్తోంది. ఆమె ఓ దశలో రిటైర్మెంట్ తీసుకుంటుందని కూడా అంటున్నారు. ఆమె మనసు పెళ్ళి మీద ఉందని పుకార్లు కూడా వచ్చాయి. ఈ మధ్యనే ఆమె 15 ఏళ్ళ సినీ కెరీర్ ఫంక్షన్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంటి వారు తొందరలో ఓ ఇంటిదానివి కమ్మని ఆశీర్వదించారు.

 

అనుష్క సీనియర్ నటి. పెళ్ళీడు దాటిపోతోందని కూడా అంతా అంటున్నారు. ఆమె వయసు అక్షరాలా 38 సంవత్స‌రాలు. టాలీవుడ్లో. కోలీవుడ్లో పెళ్ళి కానివారు ఎంతో మంది ఉన్నా వారందరి కంటే అనుష్క పెద్దది. అందువల్ల మొదట ఆమె మెడలో వరమాల పడాలి. అది ఈ ఏడాదే అంటున్నారు. అంటే ఆమె సినీ జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోయినట్లేనని అంటున్నారు.

 

అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ ఏప్రిల్ లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ తరువాత అనుష్క వేరే సినిమాలు ఒప్పుకోలేదు. దాంతో అదే అఖరు సినిమా కావాలి. అయితే తాజాగా వినిపిస్తున్న మాటలను బట్టి చూస్తే మెగాస్టార్ ఆచార్య మూవీలో చిరుకు జంటగా అనుష్కను అడిగారని అంటున్నారు. అనుష్క అపుడెపుడో చిరంజీవితో స్టాలిన్ లో ఓ సాంగులో మెరిసింది. మళ్ళీ ఈ కాంబో కుదరలేదు.

 

ఇక చిరు రీ ఎంట్రీ తరువాత వరసగా రెండు సినిమాలు చేశారు. ఆ రెండింటిలోనూ అనుష్క పేరు మొదట వినిపించడం విశేషం. కానీ ఇపుడు చిరు 152 మూవీ ఆచార్య లో అనుష్క నటించడం ఖాయమని అంటున్నారు. కొరటాల శివ డైరెక్షన్లోని మిర్చీ మూవీలో అనుష్క హీరోయిన్. దాంతో ఆయన ఆ చనువుతో అనుష్కతో సంప్రదింపులు జరిపారట.

 

అనుష్క కూడా ఓకే అన్నట్లుగా టాక్. అదే కనుక జరిగితే అనుష్క ఆచార్య మూవీతో సినీ జీవితానికి గుమ్మడికాయ కొట్టేస్తుందన్నమాట. సూపర్ తో నాగ్ పక్కన మెరిసి. ఇపుడు చిరు పక్కన  ఒదిగి అనుష్క సినీ జీవితం అందంగా ముగింపునకు వస్తుందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: