అక్కినేని నాగ చైతన్యలో ప్లస్ ల కంటే మైనస్ లే ఎక్కువగా కనిపిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. మంచి యాక్షన్ సినిమా చేస్తే చైతూని జనాలు యాక్స్పెట్ చేయడం లేదు. అందుకు యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో వచ్చి ఫ్లాపయిన సినిమాలే ఉదాహరణ. ఇక డాన్స్ లోను చైతూ చాలా వీక్. తారక్, బన్ని, రాం చరణ్ లాగా డాన్స్ బాగా చేసే సీన్ కూడా లేదు. ఇక ఏదైనా ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు చేయాలన్నా చైతూ కి సూట్ కాదు. అందుకే కేవలం లవ్ స్టోరీస్ తోనే సరిపెట్టుకుంటున్నాడు. అందుకే చైతూ నుంచి వచ్చేవన్ని ప్రేమ కథలే.

 

ఇక సాయిపల్లవి-నాగచైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం "లవ్ స్టోరీ". శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫిదా వంటి సూపర్ హిట్ తర్వాత  శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక సాయిపల్లవి-నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడం కూడా మరో ఆసక్తికరమైన విషయం. అయితే రీసెంట్ గా ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. 

 

అయితే ఈ సినిమాలోని హీరోయిన్ సాయిపల్లవి కి డాన్స్ లో ఉన్న టాలెంట్ గురించి అందరికి తెలిసిందే. కానీ సాయిపల్లవితో నాగచైతన్య డాన్స్ చేయలేకపోతున్నాడట. కనీసం నాగచైతన్య 10-20 టేకులు తీసుకుంటున్నాడట. మరి రీసెంట్ గా విడుదలైన హే పిల్లా సాంగ్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసింది. కానీ డాన్స్ విషయంలో మాత్రం చైతూ మైనస్ అవుతాడేమో అని కొందరు అంటునారు. ఇక నాగ చైతన్య లాస్ట్ హిట్ తన భార్య సమంత తో కలిసి నటించిన మజిలీ. ఈ సినిమా తర్వాత మళ్ళీ చైతూ సినిమా రాలేదు. జాను లో కలిసి నటించాల్సింది. కానీ చైతూ డ్రాపయ్యాడు. సమంత చేసింది. కానీ ఆ సినిమా సమంతకి భారీ ఫ్లాప్ ని ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: