టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజా హెగ్డే. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేసే ఛాన్స్ అందుకుంటుంది. ఇటీవల సంక్రాంతి పండుగ నాడు అలా వైకుంఠపురం లో సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పూజా హెగ్డే చేస్తున్న చాలా సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలు సాధించడంతో చాలా మంది డైరెక్టర్లు పూజా హెగ్డే తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

 

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఇదే తరుణంలో అక్కినేని అఖిల్ తో కూడా సినిమా చేస్తోంది. ఇది కాకుండా హను రాఘవపూడి తో పూజా హెగ్డే కెరీర్లో నిలిచిపోయే సినిమా చేయడానికి తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే రీసెంట్ గా హను రాఘవపూడి వినిపించిన ఒక కథ పట్ల ఆమె సుముఖతని వ్యక్తం చేసిందని అంటున్నారు. అయితే డేట్స్ చూసుకుని ఆమె అధికారికంగా చెప్పవలసి ఉందట.

 

ఆమె ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. నయనతార .. అనుష్క .. సమంత నాయిక ప్రాధాన్యత కలిగిన కథలను భుజాలపై వేసుకుంటూ ఉండగా, పూజా కూడా ఆ దిశగా అడుగులేస్తుందేమో చూడాలి. మరోపక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమాలో కూడా పూజా హెగ్డేహీరోయిన్ అనే టాక్ ఫిలింనగర్లో బలంగా వినబడుతుంది. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే వరసగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడు సినిమాలు చేసిన హీరోయిన్ గా పూజా హెగ్డే సరికొత్త రికార్డు సృష్టించినట్లు అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: