ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల గారు. దర్శకత్వంలో తనకంటూ ఒక ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న మహిళ విజయ నిర్మల. ఈవిడ ఒక దర్శకురాలు మాత్రమే కాదు, హీరోయిన్ కూడా. నిర్మల 1946 ఫిబ్రవరి 20న  తమిళనాడులో జన్మించారు.

 

విజయ నిర్మల తండ్రిది చెన్నై. తల్లిది మాత్రం గుంటూరు జిల్లా నరసరావు పేట. తెరమీద మాత్రమే కాక, డైరెక్టర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.మళయాళ సినిమా 'భార్గవి నిలయం' హీరోయిన్‌గా విజయ నిర్మల తొలి చిత్రం. రంగులరాట్నం సినిమాతో తెలుగు సినిమాలో హీరోయిన్‌గా అడుగుపెట్టారు.హీరోయిన్‌గా మొదటి సినిమా మళయాళంలో చేసిన విజయ నిర్మల, డైరెక్టర్‌గా తన మొదటి చిత్రం ‘కవిత’ను కూడా మళయాళంలోనే చేశారు.ఈ సినిమా విజయం సాధించడంతో 'మీనా' నవల ఆధారంగా, తెలుగులో అదే పేరుతో మీనా సినిమాకు దర్శకత్వం వహించారు.

దర్శకత్వంలో ఆమె పనితనం చూసి, అందరూ ఆమెను పనిరాక్షసి అని పిలిచేవారు.

 

 

బాలనటిగా కెరీర్ ప్రారంభించి, సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా.. తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించినా ఘనత ఆమెకే చెల్లింది.దాదాపు 40 సినిమాలకు డైరెక్ట్ చేసింది.కృష్ణతో విజయ నిర్మల తొలి చిత్రం సాక్షి. హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటించిన తర్వాత, ఆమె సాక్షి సినిమాలో నటించారు.తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత ఆమె కృష్ణని రెండో వివాహం చేసుకున్నారు.

 

ప్రముఖ నటుడు నరేష్ విజయ నిర్మల కొడుకు. ఆమె మొదటి భర్త వలన కలిగిన సంతానం. అప్పటికే కృష్ణ, విజయ నిర్మలకు విడి విడిగా సంతానం ఉండటం చేత వీళ్లిద్దరు మాత్రం సంతానం వద్దనుకున్నారు.  కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడువాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు.

 

తన భర్త పేరు కృష్ణ, తన పేరులోని విజయ రెండు పేర్లు కలిసేలా ‘విజయకృష్ణ’ బ్యానర్‌ను ప్రారంభించారు.తన సొంత బ్యానర్‌లో మాత్రమే కాకుండా, ఇతర నిర్మాతలు కూడా విజయ నిర్మలతో సినిమాలు చేశారు. తన భర్త కృష్ణతోపాటు, హేమాహేమీలు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును కూడా విజయనిర్మల డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కృష్ణ కూడా మరో హీరోగా నటించారు.

 

సావిత్రి, భానుమతి తర్వాత దర్శకత్వం వైపు మళ్లిన ప్రముఖ హీరోయిన్ విజయ నిర్మల. హీరోయిన్‌గా ఆమె కృష్ణతో ఎక్కువ సినిమాలు చేశారు..విధి వంచించి విజయ నిర్మలని మన నుంచి దూరం చేసింది. అనారోగ్యం కారణం చేత ఆమె చనిపోయారు.

 

ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. విజయ నిర్మల మరణాన్ని జీర్ణించుకోలేని తన భర్త అయిన కృష్ణ గారు విజయనిర్మల విగ్రహాన్ని తయారుచేయించి, ఆవిష్కరంచారు.అంతేకాకుండా ప్రతి సంవత్సరం విజయ నిర్మల జ్ఞాపకార్ధం" విజయ నిర్మల స్త్రీ శక్తి" అవార్డు పురస్కారాన్ని ఇస్తున్నారు. విజయ నిర్మల లేని లోటు సినీ ఇండస్ట్రీ కి పెద్ద చేదు వార్త. 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: