త్రివిక్ర‌మ్ టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి. ఎంత‌కీ త‌ర‌గ‌ని జ్ఞాని.  తెలుగు సినిమాకి దొరికిన ఒక గ్రంధం. స‌ర‌స్వ‌తిదేవి పుత్రుడు. క‌ళామ‌త‌ల్లికి సుపుత్రుడు. మాట‌ల‌ను తూటాలుగా చేసి పేల్చాల‌న్నా అదే మాట‌ల‌తో క‌న్నీళ్ళు కార్చాల‌న్నా త్రివిక్ర‌మ‌కే చెల్లింది. అంద‌రినీ త‌న మాట‌ల మంత్రంలో ప‌డేసే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అని చెప్పాలి. త్రివిక్ర‌మ్ ప‌శ్చిమ‌గోదావరి జిల్లా భీమ‌వ‌రంలో జ‌న్మించారు. ఆయ‌న చ‌దువుకునే రోజుల్లోనే అబ్బూరి ర‌వి మ‌రో ర‌చ‌యిత ఆయ‌న‌కు క్లాస్‌మేట్‌, బెంచ్‌మేట్‌గా ఉండేవారు. పుస్త‌కాలు చ‌ద‌వ‌డం ఇష్టం ఉండ‌డంతో అమృతం కురిసిన రాత్రి పుస్త‌కంతో పాటు అనేక పుస్త‌కాల‌ను చ‌దివేసిన జ్ఞాని మ‌న త్రివిక్ర‌ముడు. సినిమాల పైన ఆయ‌న‌కు ఎంతో ఇంట్ర‌స్ట్ ఉండేది. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం యాంక‌ర్‌గా చేస్తున్న జెమిని సురేష్ కొంత మంది ఫ్రండ్స్ ఉండేవారు. అంద‌రూ క‌లిసి ఎంతో స‌ర‌దాగా క్రికెట్ ఆడేవారు. త్రివిక్ర‌మ్ అవ‌స‌రానికి మించి మాట్లాడ‌రు. ఎంతో సైలెంట్‌గా మునిలా, ఒక రుషిలా ఉంటాడు.

 

త్రివిక్ర‌మ్ పిజి పూర్తి చేశాకే సినిమాల్లోకి వ‌చ్చారు. ఎందుకంటే చ‌దువుకోలేక సినిమాల్లోకి వ‌చ్చాడు అన్న మాట ఎవ్వ‌రూ  అన‌కూడ‌ద‌ని ఆయ‌న ఓ ఇంట‌ర‌వ్యూలో తెలిపాడు. నేటి త‌రం యంగ్ డైరెక్ట‌ర్స్ ఏ విష‌యంలోనైనా స‌రే ఆయ‌న‌ను ఎక్కువ‌గా గురువుగా భావిస్తారు. ఆయ‌న‌నే ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుంటారు. అందుకే ఆచార్య‌దేవోభ‌వ త్రివిక్ర‌మా అని కొంద‌రు అనుకుంటారు. బాపు, దాస‌రినారాయ‌ణ‌రావు, కోడిరామ‌కృష్ణ‌, ఇవివిస‌త్య‌నారాయ‌ణ వీళ్ళంద‌రూ మంచి ద‌ర్శ‌కులుగా అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో పేరు గాంచారు. త్రివిక్ర‌మ్‌కి బాగా న‌చ్చిన క‌వుల్లో తిల‌క్‌, శ్రీ‌శ్రీ‌, చ‌లం, విశ్వ‌నాధ‌స‌త్య‌నారాయ‌ణ ఇలా ఎంద‌రో ఉన్నార‌ని చెప్పాలి. అవ‌కాశాల కోసం వెతుకుతున్న త‌రుణంలో v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఇద్ద‌రికీ కూడా అవ‌కాశాల కోసం ఎదురు చూశారు. త్రివిక్ర‌మ్ ఆర్టిస్ట్ గౌత‌మ్‌రాజ్ పిల్ల‌ల‌కు హోమ్ ట్యూష‌న్ మాస్ట‌ర్‌గా ప‌ని చేశారు. ఓ సారి రూమ్ రెంట్ క‌ట్ట‌డానికి కూడా డ‌బ్బులు లేక‌పోతే సునీల్‌, త్రివిక్ర‌మ్ స‌డెన్గా రోడ్డుమీద‌కి వ‌చ్చారు. త్రివిక్ర‌మ్ విశ్లేష‌ణ చాలా లోతుగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: