తెలుగు సినిమాకి వ‌రంగా ల‌భించిన డైరెక్ట‌ర్ అంటే వి.వి.వినాయ‌క్ అని చెబుతుంటారు. బ్లాక్ బ‌స్ట‌ర్, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ వి.వి. v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఆది సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టి. తెలుగు సినిమాలో అగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో నిల‌బ‌డిపోయారు వినాయ‌క్‌. మాస్ ఆడియ‌న్స్‌లో మంచి పేరున్న వినాయ‌క్ పూర్తి పేరు వీర వెంక‌ట వినాయ‌క్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పుట్టారు. వాళ్ళ‌కు సొంతంగా థియేట‌ర్ ఉండ‌డంతో సినిమాల పైన కాస్త మ‌క్కువ ఎక్కువ‌నే చెప్పాలి. ఎప్పుడైతే ఆయ‌న డైరెక్ట‌ర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారో వెంట‌నే అలిగి మ‌రీ ఇంట్లోవాళ్ళ‌ని ఒప్పించి హైద‌రాబాద్‌కి వ‌చ్చారు. ఆయ‌న‌ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసిన ఇవివి స‌త్య‌నారాయ‌ణ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. అక్క‌డి నుండి సాగ‌ర్ వ‌ద్ద‌కు వెళ్ళారు. ఇలా ఊరు పేరు అన్నీ మారాయి. సినిమాలు తియ్యాల‌న్న క‌సి కూడా బాగా పెరిగింది.

 

ప‌ని నేర్చుకునే స‌మ‌యంలో వి.వి.వినాయ‌క్ చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించేవార‌ట‌. ఒక సీన్‌ని ఎలా చూస్తున్నారు. ఎలా న్యారేట్ చేస్తున్నారు. ఇవ‌న్నీ తెలుసుకునేవార‌ట‌. ప‌గ‌లంతా షూటింగ్ రాత్రుళ్ళుస్టోరీ రైటింగ్ ఇలా రోజుకి 18 గంట‌లు క‌ష్ట‌ప‌డుతూ డైరెక్ట‌ర్ అయ్యే వ‌ర‌కు త‌పించారు. ఆది చిత్రంతో వి.వి.వినాయ‌క్‌కి కొత్త క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరు ప‌డిపోయింది. ఆ త‌ర్వాత బాల‌య్య‌ను రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో చూపిస్తూ చెన్న‌కేశ‌వ‌రెడ్డి చిత్రం చేశారు. ఆ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్‌కి అవాక్క‌యిన చిరంజీవి వినాయ‌క్‌ని పిలిచి మ‌రీ ఠాగూర్ సినిమా ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే ఈ డైరెక్ట‌ర్ కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాని మ‌నిషి క‌మ‌ర్షియ‌ల్ కాదు.

 

అందుకే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు కూడా సినిమాల్లో ఆయ‌న కెరియ‌ర్ కి హెల్ప్ చేసిన వారికి స‌హాయం చేస్తూ ఉంటారు. ఇక వినాయ‌క్ సినిమాల‌కు ప్ర‌ధాన బ‌లం ఆయ‌న టెక్నిక‌ల్ గ్రూప్‌. వినాయ‌క్ చేసే ప్ర‌తి చిత్రానికి గౌతమ్ రాజ్ ఎడిటింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక ఆది చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ సుమోలను చిటిక వేసి లేపుతారు ఆ సీన్ బాగా హైలెట్‌గా నిలిచింది. ఇప్ప‌టికీ మ‌రిపోలేదు ఎవ్వ‌రూ. హీరోని ఫుల్ మాస్‌గా చూపించ‌గ‌ల్ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: