అత‌నొక వివాదం. అతనొక బీబ‌త్సం..అత‌నొక ప్ర‌భంజ‌నం..అత‌నొక సునామి.. అత‌నొక పిచ్చోడు.. అత‌నొక మేధావి.. అత‌నొక అర్ధం కాని వింత మ‌నిషి.. అత‌ను ఎరికి తెలియ‌ని ఒక ఎమోష‌న్.. అత‌నొక పాతాళం..అత‌నొక ఆకాశం.. అయితే ఇత‌ను అన్నం తిని బ్ర‌త‌క‌డు. కేవ‌లం వివాదాలు తిని బ్ర‌తుకుతాడు. అత‌నొక డేర్ అండ్ డ్యాషింగ్ అత‌ను ఎంత‌కి త‌ర‌గ‌ని ఓ పుస్త‌కం అత‌డే రాంగోపాల్ వ‌ర్మ‌. రామ్‌గోపాల్ వ‌ర్మ తండ్రి అన్న‌పూర్ణ‌లో సౌండ్ ఇంజ‌నీర్‌గా ప‌ని చేసేవారు. ఇక వర్మ చ‌దువుకునే రోజుల్లో ప‌రీక్ష‌లు కూడా చాలా విచిత్రంగా రాసేవార‌ట‌. ఆన్స‌ర్ తెలిసినా కూడా రాసేవారు కాద‌ట‌. ఒక ప‌రీక్ష‌లో 90 వ‌స్తే మ‌రో ప‌రీక్షలో 30 కూడా వ‌చ్చేవి కావ‌ట‌. ఎగ్జామ్స్ స‌మ‌యంలో మార్కులు చూసి వాళ్ళ అమ్మ‌గారు కూడా అవాక్క‌య్యేవార‌ట‌. వాళ్ళ అమ్మ‌గారు మార్కులు ఎందుకు త‌క్కువ‌చ్చాయి అని అడిగితే నాకు జ‌వాబులు తెలిసిన ఆనాకు రాయాల‌నిపించ‌లేదు అందుకే రాయ‌లేదు అనేవార‌ట‌. దీంతో కొడుకు ఏమ‌యిపోతాడో చాలా విచిత్రంగా ఉన్నాడ‌ని భ‌య‌ప‌డేవార‌ట‌.

 

అయితే చిన్న‌ప్ప‌టి నుంచి కూడా ఎక్కువ‌గా సినిమాలు చూసేవార‌ట‌. ఎంట‌ర్ ఆఫ్ ద డ్రాగ‌న్ సినిమా చూసిన‌ప్ప‌టి నుంచి బ్రూస్‌లీకి పిచ్చ అభిమానిగా మారిపోవ‌డ‌మే కాక క‌రాటే నేర్చుకోవాల‌ని కొన్ని రోజులు క‌రాటె క్లాసుల‌కు వెళ్లేవారు. అది కూడా కొద్ది రోజులు నేర్చుకుని మ‌ధ్య‌లో వ‌దిలేసి సినిమాల్లోకి రావాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. సినిమాల్లోకి రాగానే అంద‌రిలాగా కాకుండా చాలా విభిన్నంగా ఉండాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఒకానొక స‌మ‌యంలో ఆయ‌న హాస్ట‌ల్‌లో చ‌దువుకునేవార‌ట‌. అక్క‌డ విచిత్ర‌మైన గెట‌ప్స్ వేసి హాస్టల్‌లో ఉన్న‌వారిని భ‌య‌పెట్టేవార‌ట‌. దీంతో హాస్ట‌ల్‌వాళ్ళు వ‌ర్మ‌ని బ‌య‌ట‌కు పంపించేవార‌ట‌.

 

విజ‌య‌వాడ‌లో కొంత మంది రౌడి గ్యాంగ్‌ల‌తో ప‌రిచ‌యం పెంచుకుని ఆ గ్యాంగ్‌లో ఉండేవార‌ట‌. కానీ ఎప్పుడూ ఎవ‌రిని కొట్టేవారు కాద‌ట‌. ఇదే స‌మ‌యంలో కూలి ప‌ని చేసుకునే ఒక  అమ్మాయిని ఇష్ట‌ప‌డ్డారు. కాక‌పోతే ఒన్‌సైడ్ ల‌వ్‌గా ఉండిపోయింది. అయితే అమ్మాయి వివాహం జ‌రిగిపోయింది. ఇలా రాంగోపాల్ వ‌ర్మ సినిమాలు కూడా ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల‌తో తీస్తారు. రౌడీలు, రాజ‌కీయ నాయ‌కులు బ‌యోగ్ర‌ఫీలు ఎటువంటి జంకు లేకుండా అవ‌లీల‌గా తీసేస్తుంటారు. అలాగే ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ కూడ కొంత కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఉండేది. వివాదాల‌కు సంచ‌ల‌నాలు ఎప్పుడూ ఆయ‌న‌తోనే ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: