యువ హీరో నాగ శౌర్య సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తను మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఇయర్ అశ్వద్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య ఆ సినిమాతో నిరాశపరిచాడు. ఇక ఇదిలాఉంటే ప్రస్తుతం నాగ శౌర్య రెండు సినిమాలు సెట్స్ మీది ఉన్నాయి. సంతోష్ జాగర్లముడి డైరక్షన్ లో నాగ శౌర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కెతిక శర్మని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.డబ్ స్మాష్ బ్యూటీ కెతిక శర్మ ప్రస్తుతం పూరి ఛార్మి నిర్మిస్తున్న రొమాంటిక్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. 

 

ఈ సినిమాలో ఆకాష్ పూరితో అమ్మడు బీభత్సమైన రొమాన్స్ చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై భారీ క్రేజ్ తెచ్చాయి. కెతిక హాట్ అప్పీల్ సినిమాకు చాలా ప్లస్ అయ్యేలా ఉంది. ఇక మొదటి సినిమా రిలీజ్ అవలేదు అయినా సరే అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చేస్తున్నాయి. నాగ శౌర్యతో కెతిక జోడి అంటే అమ్మడికి లక్కే ఛాన్స్ అన్నట్టే. ఫస్ట్ మూవీ రిలీజ్ అవకుండానే అమ్మడికి వరుస ఛాన్సులు రావడం కూడా లక్కీ అని చెప్పొచ్చు.

 

ఇక ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. ఛలో తర్వాత మళ్ళీ సక్సెస్ కు దూరమైనా నాగ శౌర్య తనకు సూట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. తను ఎంత బాగా పెర్ఫార్మ్ చేసినా దర్శకుడు చేసే మ్యాజిక్ ను బట్టే సినిమా ఆడుతుంది. ఛలో దర్శకుడు వెంకీకుడుములు తన సెకండ్ సినిమా భీష్మాని హిట్ అందుకున్నాడు. అలా ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యే కాన్సెప్ట్ తో వస్తే తప్పకుండా సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టే. మరి హిట్టు కోసం తపిస్తున్న నాగ శౌర్యకు ఈ సినిమా అయినా ఆ దాహం తీరుస్తుందేమో చూడాలి. మంచి నటుడని పేరు తెచ్చుకున్నా తాను ఎంపిక చేసుకునే కథలే నాగ షోర్య కెరియర్ ను రిస్క్ లో పడేస్తున్నాయి. మరి నాగ శౌర్య ఇక మీద కథల విషయంలో కూడా జాగ్రత్త పడితే బెటర్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: