టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకరు. వందకు పైగా సినిమాలు తీసిన ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. దాదాపు అగ్ర హీరోలు అందరితో ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసారు. ఎన్టీఆర్, శోభన్ బాబు, అక్కినేని, ఇలా ఎవరితో చూసుకున్నా ఆయన అందరితోను సినిమాలు చేసారు. ఇక ఆ తర్వాతి తరం చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా అగ్ర హీరోలతో ఆయన సినిమాలు చేసారు. అందరు హీరోలకు ఆయన ఫేవరేట్ దర్శకుడిగా మారిపోయారు. ఆయన సినిమాలకు ముందు సినిమాలో హీరోయిన్ అంటే ఒక అభిప్రాయం ఉండేది. 

 

ఆయన సినిమాల తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మార్చేసారు. హీరోయిన్ ని ఎన్ని విధాలుగా అందంగా చూపించవచ్చో అన్ని విధాలుగా అందంగా చూపించారు ఆయన. ఆయన సినిమాల్లో హీరోయిన్లకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. వారి నటనకు, వారి అందానికి, వాళ్ళు చేసే పాటలు ఇలా అన్నీ కూడా అందంగానే చూపించే వారు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్లను ఆయన చూపించిన విధానం చూసి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది అనేది వాస్తవం. ఆ విధంగా రాఘవేంద్ర రావు సత్తా చాటారు. 

 

టాలీవుడ్ లో కూడా చాలా మంది దర్శకులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. అగ్ర దర్శకులు కూడా ఆయన్ను చూసి కొత్త పాటాలు నేర్చుకునే వారు. కొన్ని కొన్ని భావోద్వేగ సన్నివేశాలను ఎంత అందంగా చూపించవచ్చు అనేది ఆయన నుంచి నేర్చుకున్న వారు చాలా మంది దర్శకులు ఉన్నారు. ఎన్టీఆర్ తో ఆయన చేసిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయం సాధించాయి. చిరంజీవి తో ఏకంగా 14 సినిమాలు చేసారు. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు ఆయన. ఇప్పటికి యువ దర్శకులు చాలా మంది ఆయన నుంచి పాటాలు నేర్చుకుంటూనే ఉంటారు. శ్రీదేవి హీరోయిన్ గా చాలా సినిమాలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: