తెలుగు సినిమా ఇప్పుడు ఎక్కువగా కమర్షియల్ కోణం ఇష్ట పడుతుంది. కమర్షియల్ సినిమాలను ఈ మధ్య కాలంలో హీరోలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే కమర్షియల్ సినిమాల వైపే దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇలా కమర్షియల్ గా మారిన దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. టాలీవుడ్ లో ఆయన కోసం ఇప్పుడు హీరోలు, నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. సామాజిక అంశాన్ని తీసుకుని దానికి కమర్షియల్ కోణం జోడించి సినిమా చేసి హిట్ కొట్టడం ఆయనకే సొంతం. 

 

ప్రభాస్ తో ఆయన చేసిన మిర్చీ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఆ సినిమా ప్రభాస్ తో చేసిన తర్వాత ఆయనకు అన్నీ మంచి ఆఫర్లు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించి ఆఫర్ ఇచ్చారు. ఇప్పటి వరకు అతను చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అను నేను సినిమాలు చేసారు ఆయన. ఆ సినిమాలు అన్నీ భారీ వసూళ్లు సాధించడంతో ఇక ఆయనతో సినిమా చేయడానికి చిరంజీవి కూడా ఆసక్తి చూపించారు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న దర్శకుడు ఆయన. ఆయన కోసం హీరోలు పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు తీయాలి అంటే కచ్చితంగా కొరటాల అయితేనే బాగుంటుంది అనే అభిప్రాయ౦ అగ్ర హీరోలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అందుకే తక్కువ కాలంలో కొరటాల కమర్షియల్ దర్శకుడు అయిపోయారు. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎక్కువగా పోటీ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా అయినా సరే కొరటాల తో చేయడానికి గాను గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: