మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్... టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఆయన ఒకరు. అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా కొందరు హీరోలతో ఆయన సినిమాలు చేసారు. ఈ తరం దర్శకుల్లో ఆయన టాప్ దర్శకుడు. సినిమా హిట్ ఫ్లాప్ అనేది సంబంధం లేని విషయం. అయినా సరే ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన అత్తారింటికి దారేది, జల్సా సినిమాలు ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఆయన చేసన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 

 

అల్లు అర్జున్ తో ముందు జులాయి సినిమా చేసారు, ఆ సినిమా అల్లు అర్జున్ కి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బన్నీ తో ఆయన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చేసారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇటీవల అల వైకుంఠపురములో సినిమా చేయగా ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక ఇది పక్కన పెడితే ఆయన సినిమాలను చూసి టాలీవుడ్ జనాలు చాలానే నేర్చుకుంది అని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాల్లో ఉండే కొన్ని కోణాలు టాలీవుడ్ కి సినిమా ఈ తరానికి ఏ విధంగా నచ్చుతుందో చెప్పాయి. 

 

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని, మాస్ ఆడియన్స్ ని కలిపి ఏ విధంగా అలరించాలి, ఈ తరం ప్రేక్షకులు ఏది కోరుకుంటున్నారు అనేది త్రివిక్రమ్ కి తెలిసినంత అందంగా మరో దర్శకుడికి తెలియదు. కొంత మంది దర్శకులు ఆయనను చూసి నేర్చుకున్నవి ఎక్కువగానే ఉన్నాయి. ఫైట్ లు కంటే మాటలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ప్రేక్షకులు. వారికి అది తన సినిమాల్లో తన రచనలతో ప్రేక్షకులకు అందించాడు. అక్కడి నుంచి ఎక్కువగా దర్శకులు తమ సినిమాల్లో మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: