కరోనా వల్ల భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంతనష్టం వాటిల్లు తుంది అన్నవిషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ఈవైరస్ వల్ల ఇప్పుడు వెంటనే రాజమౌళి ప్రభాస్ లకు భారీ నష్టం కలిగే ఆస్కారం కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘మా’ అసోషియేషన్ షూటింగ్ లను నిలుపుదల చేయమంటూ ఇచ్చిన పిలుపుకు ఫిలిం చాంబర్ వెంటనే స్పందించడంతో ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో షూటింగ్ లు జరుపుకుంటున్న సినిమాలతో పాటు విదేశాలలో షూటింగ్ లు జరుపుకుంటున్న తెలుగు సినిమాలు కూడ ఆగిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.


తెలుస్తున్న వార్తల ప్రకారం ఫిలిం చాంబర్ ఆదేశాల ప్రకారం ఎక్కడికక్కడ షూటింగ్ లు నిలిపివేసి ఈనెల 19వ తారీఖు నాటికి అన్ని సినిమాల యూనిట్లు తమ ఎక్విక్ మెంట్స్ తో సహా వెనక్కు వచ్చి తీరాలని ఫిలిం చాంబర్ డెడ్ లైన్ పెట్టింది అని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈషూటింగ్ ల నిలుపుదల ఈనెలాఖరి వరకు అని చెపుతున్నా ఈనిలుపుదల వచ్చేనెల కూడ కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ మూవీకి పెను సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 


తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతాలలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ చేసుకుంటాను అని చెప్పినా ఫిలిం ఛాంబర్ వర్గాలు రాజమౌళి అభ్యర్ధనలను తిరస్కరిస్తున్నట్లు టాక్. ఇదే జరిగితే అలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి ఈనెలలో ఇచ్చిన డేట్స్ అన్నీ వృథా అయిపోవడంతో తిరిగి కథ ముందుకు వస్తుందని రాజమౌళి టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. 


ఇది ఇలా ఉండగా విదేశాలలో షూటింగ్ లు జరుపుకుంటున్న ఫిలిం యూనిట్స్ ను కూడ 19 తారీఖునాటికి అందరు తిరిగి వచ్చేయమని ఫలిం ఛాంబర్ స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో ప్రస్తుతం జార్జియా దేశంలో షూటింగ్ చేసుకుంటున్న ప్రభాస్ జిల్ రాథా కృష్ణల యూనిట్ కూడ తిరిగి రావలసిన పరిస్థితి. ఒకవేళ ఫిలిం ఛాంబర్ ఆదేశాల ప్రకారం ప్రభాస్ హైదరాబాద్ కు తిరిగి వచ్చినా కరోనా విలయతాండవం చేస్తున్న యూరప్ నుండి ప్రభాస్ వచ్చాడు కాబట్టి అతడికి అతడి యూనిట్ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించడమే కాకుండా ప్రభాస్ కు అతడి యూనిట్ కు కరోనా వ్యాధి లక్షణాలు లేకపోయినా 14 రోజులు ప్రత్యేకమైన గదిలో ఉంచవలసిన విచిత్ర పరిస్థితి. దీనితో ప్రభాస్ రాజమౌళిలు ఇలాంటి సమస్యల నుండి ఎలా గట్టెక్కుతారు అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: