సినిమాల్లో ప్రయోగాలు అనగానే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది తమిళ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు. ఆ సినిమాల్లో దర్శకులు ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాని మన తెలుగులో మాత్రం ప్రయోగాలు చెయ్యాలి అంటే చాలా మంది దర్శకులు భయపడుతూ ఉంటారు. హీరోలు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాత ప్రయోగాలకు ఓకే చెప్తూ ఉంటారు. దీనికి తోడు నిర్మాతలు కూడా అమ్మో ప్రయోగం అనే పరిస్థితి మన తెలుగులో ఎక్కువగా ఉంటుంది అనేది వాస్తవం. ప్రస్తుతం టాలీవుడ్ లో వచ్చే ఆ కోణం సినిమాలు తక్కువే. 

 

అయితే క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ మాత్రం ప్రయోగాలు చెయ్యాలి అంటే ముందు ఉంటాడు. అతని సినిమాలు అన్నీ కూడా ఇదే విధంగా ప్రయోగాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆర్య 2 సినిమా గాని, జగడం గాని, మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా గాని, ప్రయోగాలే. ఆ సినిమాలు ఫ్లాప్ అయినా సరే అతను మాత్రం భయపడలేదు. రామ్ చరణ్ హీరోగా ఆయన చేసిన రంగస్థలం సినిమా టాలీవుడ్ ని షేక్ చేసింది అనేది వాస్తవం. ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు టాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు. హీరో ఇమేజ్ ని పక్కన పెట్టి రామ్ చరణ్ ఆ విధంగా చేసాడు. 

 

ఇక హీరోయిన్ సమంతా గ్లామర్ ని పక్కన పెట్టి ఆమెను పక్కా మొరటు అమ్మాయిగా చూపించడంలో అతను సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆయన ఇప్పుడు... అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా దాదాపుగా ప్రయోగమే. కొత్త కోణంలో సినిమాను చూపించి ప్రేక్షకులను మెప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో కొంత మంది దర్శకులు ఆయన మాదిరి సాహసం చెయ్యాలని చూసినా సరే వెనకడుగు వేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: