మన తారలు ఎప్పుడు ప్రకృతి వైపరిత్యాలు తాండవించినా ప్రజలను ఆదుకోవడానికి, వాళ్ళకి ఆసరాగా అండగా ఉండటానికి ముందుంటారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బబు దగ్గర్నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు అందరూ తమవంతు సహాయం అందించడానికి ముందుకు వస్తారు. వాళ్ళలో ఇంకా త్వరగా స్పందించే వ్యక్తి మంచూ మనోజ్. సామాజిక సేవలో ఆయన ఎప్పుడు ముందుంటారు. అక్క లక్ష్మీ ప్రసన్న కూడా తన షోస్ ద్వారా ఎంతో మందికి సహాయం చేసింది.

 

ఇక కరోనా వైరస్ వణికిస్తూ విజృంభిస్తోన్న నేపథ్యంలో మనోజ్... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపడతు... ప్రజలను చైతన్యం చేస్తున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, భోజనం చేసే ముందు చేతులు సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలని, ఆల్కహాలిక్ శానిటైజర్లు వాడాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని ప్రజలను చైతన్యం చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం బయట హ్యాండ్ శానిటైజర్ల కొరత ఏర్పడింది. నిజానికి పేద ప్రజలు ఈ శానిటైజర్లను కొనుగోలు చేసుకోలేని పరిస్థితి. అందుకే వారి కోసం మంచు మనోజ్ నేనున్నాని ముందుకొచ్చారు. మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు.

  

మాస్క్‌లు, శానిటైజర్లను కొనుగోలు చేసుకునే స్తోమతలేని వారికి, అసలు వీటిపై సరైన అవగాహన లేనివారికి తన వంతు సాయంగా వాటిని పంపిణీ చేస్తున్నానని మనోజ్ తెలిపాడు. అందరూ మంచు మనోజ్ చేస్తోన్న ఈ మంచి పనికి ప్రశంసలు అందుతున్నాయి. నిజానికి హైదరాబాద్‌లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనప్పుడు ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మాస్క్‌లు, శానిటైజర్ల కోసం ఫార్మసీల చుట్టూ తిరగని వారు లేరు. కానీ, అప్పట్లో వీటి కొరత భారీగా ఉంది. అలాంటి సమయంలోనే సినీ ప్రముఖులు చాలా మంది భయాందోళనకు గురికావద్దని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలని స్పందించారు. తాజా ఆ.ఆర్.ఆర్ హీరోలు రాం చరణ్, ఎన్.టి.ఆర్ కూడా కరోనా విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచనలిస్తూ వీడియోని రిలీజ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: