టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీనుల పేర్లు వినపడతాయి. అందరి దర్శకులది ఒకదారైతే వీళ్ళిద్దరిది సెపరేట్ దారి. వీళ్ళతో సినిమా తీసిన తర్వాత హీరో ఇమేజ్ మారిపోతుంది. ఆల్రెడీ స్టార్ అయితే ఆ క్రేజ్ డబుల్ అవుతుంది. పూరి ఏమో తనతో సినిమా చేసే హీరో ఇదివరకు ఇమేజ్ ఎలా ఉన్నా తన సినిమా వరకు ఆ హీరోని రఫ్ గా చూపిస్తాడు. ఇక బోయపాటి శ్రీను మాత్రం హీరోలను మాస్ హీరోలుగా తీర్చిదిద్దుతాడు. 

 

పూరి స్టైల్ ఆఫ్ సినిమా మేకింగ్ బాగుటుంది. సినిమా ఓపెన్ చేశాడు అంటే పూర్తి చేసే వరకు నిద్రపోడు. టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో అతి తక్కువ కాలంలో సినిమాలు తీసే దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రమే అని చెప్పొచ్చు. పూరితో సినిమా హీరో ఇమేజ్ కూడా మారిపోతుంది. వాళ్ళ డైలాగ్ డెలివెరి స్టైల్ కూడా మార్చేస్తాడు పూరి. అందుకే పూరితో సినిమా అంటే హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్, పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, బాలయ్య వీళ్లంతా పూరితో సినిమా చేశారు.

 

ఇక బోయపాటి శ్రీను విషయానికి వస్తే తన సినిమాల ఫార్మేట్ లు ఒకేలా ఉన్నా అందులో హీరో మాత్రం చాలా బలవంతుడుగా కనిపిస్తాడు. హీరో ఇమేజ్ మార్చే దర్శకుల్లో బోయపాటి కూడా ఒకరని చెప్పొచ్చు. హీరో స్ట్రెంత్ ను పర్ఫెక్ట్ గా వాడుకునే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క బోయపాటి శ్రీను మాత్రమే అని చెప్పొచ్చు. అతని సినిమాలో స్టార్స్ ను సూపర్ హీరోగా చూపిస్తాడు. సినిమా మొత్తం మీద ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడుచుకుని సీన్ ఒక్కటైనా పెడతాడు అది బోయపాటి స్టైల్. ఇలా పూరి బోయపాటి ఇద్దరు తమ టాలెంట్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: