పూరీ జగన్నాథ్.. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి దాదాపు చేసిన ప్రతి సినిమా హిట్ కొట్టాడు. ఇతను ఒక డైరెక్టర్ ఏ కాదండోయ్.. అన్ని కళలు పుణికిపుచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. ఇతను ఒక దర్శకుడు, నిర్మాత, ఇంకా రచయిత కూడా. ఇతను మొదట డైరెక్షన్ చేసిన సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి.. అలాగే పూరీ 2006లో దర్శకత్వం వహించిన పోకిరి సినిమా ఇతన్ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళింది. అప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత హిట్ కాలేదు. అప్పట్లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. అత్యధిక వసూళ్లను సాధించింది.

 

 

2006లో పూరీ తీసిన సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను 2009లో  విడుదలైన మగధీర సినిమా దాటుకుని వెళ్ళింది. పూరీ జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.   2009వ సంవత్సరంలో నేనింతే సినిమాకి పురస్కారము లభించింది.

 

 

ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యి ఆయనకు ఒక పేరును సంపాదించి పెట్టాయి. ఈయన సినిమాలలో ఏదో తెలియని మ్యాజిక్.. తన అభిమానులందరిని థియేటర్లకు తీసుకుపోతాయి. పూరీ ఇటీవల డైరెక్ట్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్ అసలు ఈ సినిమా అయితే.. బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపేసింది. సినిమాలలో ఈయనకంటు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈయన ఏ సినిమా చేసిన తమ అభిమానులకు ఓకే చూడొచ్చు అనే నమ్మకం ఉంటుంది.

 

 

 

పూరీ జగన్నాథ్ యువ దర్శకులను ప్రోత్సహించేందుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తి అయ్యారు. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని సినిమారంగానికి పరిచయం చేస్తూ అప్పులాంటి విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: