తెలుగు సినిమా ప్రేక్షకులకు మాస్ సినిమాల సత్తాను కొత్తగా చూపించిన దర్శకుడు వివి వినాయక్. దర్శకుడు కావాలనుకోవడం ఓ కల అయితే.. అందులో ప్రత్యేకత చూపించుకోవడం ఓ కళ. ఇందులో వంద శాతం సక్సెస్ అయ్యాడు వినాయక్. దర్శకుడిగా తొలి సినిమా తెరకెక్కించక ముందు ఎన్నో ఏళ్లుగా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా, కోడైరక్టర్ గా అనేక సినిమాలకు పని చేశాడు. స్క్రీన్ ప్లేపై గట్టి పట్టున్న డైరక్టర్ గా వినాయక్ పేరు ఉంది. స్క్రీన్ ప్లే అంటే ఏంటో నేను వినాయక్ దగ్గరే నేర్చుకున్నాను అని దిల్ రాజు కూడా ఓ సందర్భంలో చెప్పాడు.

 

 

ఊళ్లో సొంత సినిమా ధియేటర్ ఉన్న నేపథ్యం నుంచి సినిమాల్లోకి వచ్చాడు వినాయక్. సమస్యల్లో నుంచి, కష్టం విలువ తెలుసుకుని పరిశ్రమలోకి అడుగుపెట్టిన వినాయక్ కు కొందరు దర్శకుల దగ్గర అవమానాలు ఎదురయ్యాయి. సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటూ దర్శకుడు సాగర్ వద్ద అసిస్టెంట్ గా కుదురుకున్నాక కథలు జడ్జ్ చేయడం, స్క్రీన్ ప్లేపై పట్టు తెచ్చుకోవడంపై దృష్టి పెట్టాడు. అలా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ గా పని చేశాక డైరక్టర్ కావటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అప్పట్లో ఎన్టీఆర్ కూడా సినిమాలకు కొత్త. తనకు దిల్ కథ వినిపిస్తే మాస్ కథ అయితే బెటర్ అనడంతో ప్రిపేర్ చేసి వినిపించాడు. అదే ‘ఆది’.

 

 

సినిమా ఎన్టీఆర్ కు స్టార్ డమ్, వినాయక్ కు లైఫ్ ఇచ్చిన సినిమాగా నిలిచింది. సుమోలు గాల్లో లేపడం అనే టెక్నిక్ ను వాడి దానికి అనఫిషియల్ బ్రాండ్ అయిపోయాడు. ఏకంగా మెగాస్టార్ తో ఠాగూర్ సినిమా తీసే అవకాశం పొందాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో వెనుతిరిగి చూడని వినాయక్ ఇండస్ట్రీలో టాప్ డైరక్టర్ గా ఎదిగాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: