టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయాలను సాధించే దర్శకులు ఉండొచ్చు. కానీ.. వరుస విజయాలతో అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఇస్తూ.. బాక్సాఫీస్ రికార్డులను ఆయన సినిమాలతోనే తిరగరాస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. అసలు ఈయన తీసిన ప్రతి సినిమా ఒక బ్లాక్ బస్టర్. ఆయన మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెం.1 దగ్గర నుంచి గత సంవత్సరం వరకు తీసిన బాహుబలి వరకు ఏ ఒక్క ప్లాఫ్ లేదు. జకన్న ఇప్పటి వరకు తన కెరీర్ లో 11సినిమాలు మాత్రమే చేశాడు.

 

 

ఈయన చేసే ప్రతి సినిమాను చూపరులకు ఆకట్టుకుంటాయి. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్. అసలు జక్కన్న తీసిన ప్రతి సినిమా  వరుసగా ఎలా హిట్ అవుతున్నాయి. అలా హిట్ కొట్టడానికి రాజమౌళి ఏ ఫార్ములాను యూజ్ చేస్తున్నాడనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జక్కన్న ఒక సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడని అనుకోండి మొదట ఆ సినిమా స్టోరీ సిద్దం చేసుకుంటాడు. 

 

 

తర్వాత ఆ కథను ఆ చిత్ర యూనిట్ కు వినిపించి వారికి ఎలా ఉందో తెలుసుకుని ఆ తర్వాత స్క్రిప్ట్ మొదలు పెడతాడు.  స్క్రిప్ట్, డైలాగులు అన్ని పూర్తి చేసిన తరువాత స్టోరీ బోర్డు వేసుకుంటారు. ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని అనుకున్నా ఫైనల్ గా స్టోరీ బోర్డు పూర్తయ్యే వరకు మార్పులు చేర్పులు చేస్తాడు. ఒక్కసారి పూర్తయ్యి, సెట్స్ మీదకు పోతే సినిమా అలా చేసుకుంటూ వెళ్తారు. మళ్లీ దానికి సంబంధించి ఏ మార్పులు చేయరు. 

 

 

 జక్కన్న ఒక మామూలు ప్రేక్షకుడు ఒక సినిమాను ఎలా కావాలనుకుంటున్నాడు. వానికి ఏ విధంగా చేస్తే ఆ సినిమా నచ్చుతుంది. ఇంకా ఆ సినిమాలో ఏం కావాలని కోరుకుంటాడో అవన్నీ కూడా అయన సినిమాలో ఇవ్వగలుగుతున్నాడు. అనే కాన్సెప్ట్ తో ఎస్ ఎస్ రాజమౌళి ఆలోచిస్తాడు. ఇంత దిగువగా అలోచించటం వలన ప్రతి ప్రేక్షకుడు సినిమాకి వస్తాడు. అందుకే ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: