ఎస్ఎస్ రాజమౌళి... టాలీవుడ్ చరిత్రలో కచ్చితంగా లిఖించే పేరు. ఆయన తీసిన సినిమాలు సాధించిన విజయాలు తక్కువే అయినా... విజయం సాధించిన ప్రతీ సినిమా కూడా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది అనే మాట అక్షరాలా నిజం. ఎందరో హీరోలకు ఆయన డ్రీం దర్శకుడు అయ్యాడు. సినిమా తీస్తే పది కాలాల పాటు ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలి అనే కోణంలో ఆయన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆయన ఒక సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. 

 

ఇది పక్కన పెడితే రాజమౌళి ఏ సినిమాను కూడా అతి తక్కువ కాలంలో పూర్తి చేసిన సందర్భం అనేది ఈ మధ్య కాలంలో లేదు అనేది వాస్తవం. ఆయన తీసిన ప్రతీ సినిమా కూడా ఎక్కువ సమయం తీసుకుని మంచి విజయం సాధించినవే. బాహుబలి సినిమా కోసం ఆయన దాదాపు ఆరేళ్ళు తీసుకున్నారు. ఆ రెండు భాగాలు కూడా టాలీవుడ్ ఖ్యాతిని పెంచాయి. అప్పటి వరకు తెలుగు సినిమా గురించి బాలీవుడ్ పెద్దగా మాట్లాడుకోలేదు. కాని ఈ సినిమా తర్వాత మాత్రం బాలీవుడ్, హాలీవుడ్ మాట్లాడుకున్నాయి. ఆ విధంగా ఈ సినిమా విజయం సాధించింది. 

 

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం దాదాపు రెండేళ్లకు పైగా తీసుకునే ప్రయత్న౦ చేస్తున్నారు. ఈ సినిమాను ఇద్దరు హీరోలతో చేయడంతో బాలీవుడ్ కూడా దీని గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. ఆ విధంగా జక్కన్న టాలీవుడ్ లో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. ఆయన ఒప్పుకుంటే బాలీవుడ్ హీరోలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయినా సరే రాజమౌళి తన సినిమాలను ఎక్కువగా తెలుగులో ఉండే విధంగానే చూస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఆయన అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: