టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. భద్ర సినిమా నుంచి మొదలుపెడితే నేడు ఆయన చేసే బాలకృష్ణ సినిమా వరకు అన్నీ కూడా మాస్ ఆడియన్స్ కి దగ్గరైన సినిమాలే. ఒక స్టార్ హీరోని ఏ విధంగా చూపిస్తే ప్రేక్షకులు చూస్తారు అనేది ఆయనకు బాగా తెలుసు. మాస్ మార్కెట్ ఎక్కువ కాబట్టి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన చేసిన తొలి సినిమా భద్ర అదే విధంగా మాస్ ఆడియన్స్ కి దగ్గరైంది. ఆ తర్వాత ఆయన చేసిన తులసి సినిమా కూడా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. 

 

ఇక బాలకృష్ణ తో ఆయన చేసిన... సింహా లెజెండ్ సినిమాలు మాత్రం ఆయన కెరీర్ ని మలుపు తిప్పాయి. బోయపాటి బాలయ్య ఫాన్స్ కి ఈ రెండు సినిమాల ద్వారా బాగా దగ్గరయ్యారు. ఆ రెండు సినిమాల్లో బాలకృష్ణ ను ఆయన చూపించిన విధానం, రాజకీయాలను ఆయనకు లింక్ పెట్టి చేసిన విధానం బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పవచ్చు. అక్కడి నుంచి బాలకృష్ణ ఫాన్స్... ఆయన సినిమా ఫ్లాప్ అయిన వెంటనే బాలయ్య తో సినిమా చెయ్యాలని కోరడం గమనార్హం. బాలకృష్ణ కూడా కూడా బోయపాటి బాగా దగ్గరయ్యారు. 

 

ఇప్పుడు తన రెండు వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో బాలకృష్ణ వెంటనే బోయపాటి శ్రీను తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ విధంగా టాలీవుడ్ లో బాలకృష్ణ కు, ఆయన ఫాన్స్ కి మాత్రమే దగ్గరైన దర్శకుడు బోయపాటి. బాలకృష్ణ ను ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపిస్తూ ఉంటారు ఆయన. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే మాత్రం బోయపాటి బాలయ్య అభిమానులకు దేవుడు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ సినిమా వేసవిలో రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: