అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫామ్ లో ఉన్న యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు. ఒకపక్క కామెడీ, మరోపక్క యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ అన్ని సమపాళ్లలో కలిపి తీస్తాడు సినిమాలను. ఎక్కడ ఏది మిస్ చేయడు.  పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్ 2’ వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఓటమి ఎరుగుని దర్శకుడిగా ఫామ్‌లో ఉన్నాడు అనిల్ రావిపూడి. రీసెంట్‌గా మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని రూపొందించి బాక్సాఫీస్ ని షేక్ చేసారు. అయితే అనిల్ రావిపూడి నిజ జీవితంలో ఎన్నో కష్ట, నష్టాలని ఎదుర్కొని ఈ స్థాయి కి వచ్చారట.

 


ఒక ఫంక్షన్ లో అనిల్ రావిపూడి తన జీవితంలో ఎదుర్కున్న ఒడిదుడుకుల గూర్చి వివరించారు.  ఈరోజు అనిల్  అనుభవిస్తున్న నేమ్ అండ్ ఫేమ్ అంతా ఓవర్ నైట్‌లో వచ్చింది కాదట.  తన తండ్రి ఆర్టీసీ డ్రైవర్‌గా కేవలం 4 వేల రూపాయల జీతం తీసుకుని తనను చదివించారని.. అయితే అలాంటి పరిస్థితుల్లో తాను తీసుకున్న ఓ నిర్ణయమే ఈ రోజు అనీల్ రావిపూడిగా మీ ముందు నిలబెట్టిందని తన రియల్ లైఫ్ విషయాలను తెలియజేశారు అనిల్ రావిపూడి.వాళ్ళ  ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ అంట . చాలి  చాలని జీతం తో ఇల్లు గడిచేదట. తండ్రికి నాలుగు వేల రూపాయల జీతం. అనిల్ స్వస్థలం  ప్రకాశం జిల్లాలోని  ఒక చిన్న పల్లెటూరు. అనిల్ కి ఎంసెట్‌లో 8 వేలు ర్యాంక్ వచ్చింది. మంచి కాలేజ్‌లో పేమెంట్ సీట్ తీసి ఏడాది 45 వేలు ఫీజు కడుతూ చదివించారట. మా నాన్న సంపాదనకు నన్ను చదివించడం చాలా కష్టం అయ్యేది. ఆయనకు వచ్చే నాలుగు వేలు సరిపోయేవి కావు. బ్యాంక్ లోన్లు అవీ ఇవీ తీశారు. అయినా సరిపోయేవి కాదు. 

 

 

అందుకే మా నాన్న తెల్లవారు జామున 4 గంటలకు డ్యూటీ వెళ్లిన మా నాన్న.. నైట్ 12 గంటలకు వచ్చేవారు. అందులోనే బస్ డ్రైవ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. పల్లెటూర్లలో రోడ్లు చాలా దారుణంగా ఉండేవి. అయినా సరే పక్కవిలేజ్‌లో కేబుల్ నెట్ వర్క్ నడిపేవాడు.అనిల్ రావిపూడి ఎదుగుదలకి కారణం వాళ్ళ తల్లితండ్రులు అని తెలిపాడు.  చదువు అయిపోయాక మంచి ఉద్యోగం చేస్తాడని తండ్రి భావించాడట కానీ అనిల్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సినిమాల్లోకి వెళ్తా అని..అనిల్ వాళ్ళ తండ్రి తిట్టకుండా సరే 3సంవత్సరాలు ట్రై చెయ్, ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోతే ఉద్యోగం చేసుకో అని అన్నారట.

 

 

అనిల్ కి బాగా ఇష్టమైన డైలాగ్.. పూరీ జగన్నాథ్ గారు ‘బిజినెస్‌మేన్‌లో రాశారు. మన టార్గెట్ టెన్త్ మైల్ అయితే.. ఎయిమ్ ఫర్ లెవన్త్ మైల్. కోడ్తే దిమ్మ తిరిగిపోవాలంతే’.. ఈ డైలాగ్ అంటే  అనిల్ కి చాలా ఇష్టం అంట. ఎందుకంటే మన గోల్ ఎప్పుడూ పెద్దగానే ఉండాలి. నలుగురిలో ఉండాలనుకోవడం కరెక్టే.. బట్ నలుగురి కంటే పైన ఉండాలనుకునే ఆలోచననే మనల్ని ఫ్రెంట్ పేజ్‌కి తీసుకువస్తుంది అని అనిల్ ఉద్దేశం. ఆలా అనిల్ సినీ ప్రస్థానం మొదలుఅయ్యింది. f2 లో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ కూడా సూపర్ హిట్.. ప్రతి సంక్రాతి కి ఒక కొత్త సినిమాతో మనముందుకు వస్తున్నాడు అనిల్ రావిపూడి. రీసెంట్ గా ఒక బాబు కి కూడా తండ్రి అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: