అర్జున్ రెడ్డి... టాలీవుడ్ లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో చూడని కోణాలను ఈ సినిమాలో చూపించారు. ఆ సినిమాలో అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ నటన, ప్రీతి శెట్టి గా శాలిని పాండే నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అప్పటి వరకు ఒక లెక్క అప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు టాలీవుడ్ లో ఆ సినిమా సంచలనం సృష్టించింది అనేది వాస్తవం. ఆ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో టాలీవుడ్ కూడా కొన్ని కొన్ని నేర్చుకుంది. 

 

హీరోలో ఉన్న టాలెంట్ ని ఆ సినిమా బయటపెట్టింది. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమా ఆ రేంజ్ లో విజయం సాధించింది అంటే కచ్చితంగా సందీప్ కారణం. ఒక హీరోలో అన్ని కోణాలు చూపించాడు. ఆ కథ కూడా ఒక సంచలనం. ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్ధం కాదు. ప్రతీ సీన్ లో దర్శకుడు... తన మనసులో హీరో ఏ విధంగా ఉండాలి అనుకున్నాడో ఆ విధంగానే చూపించాడు. హీరో పాత్ర ఇలాగే ఉండాలి అనుకున్నాడు అలాగే చూపించాడు. ధైర్యంగా లిప్ లాక్ సీన్స్ చేసి టాలీవుడ్ ని ఒక ఊపు ఊపాడు. 

 

సినిమా చూసిన ప్రేక్షకులు అయితే దర్శకుడి టాలెంట్ కి ఫిదా అయిపోయారు. ఆ సినిమాను చూసి మెడికల్ స్టూడెంట్స్ కూడా చాలానే నేర్చుకున్నారు. మంచి వసూళ్లు సాధించింది ఆ సినిమా. బహుసా ఆ సినిమా అంత విజయం సాధిస్తుంది అని సందీప్ కూడా భావించి ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా చూపించాడు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా ఆ సినిమాను తెరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: