రైటర్ గా ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా మారిన వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మాటల రచయితగా త్రివిక్రమ్ కు సెపరేట్ స్టయిల్ ఉంది. దర్శకుడిగా మారిన తర్వాత కూడా ఆయన సినిమాల్లో కథలు అంత గొప్పగా లేకున్నా మాటలు మాత్రం చాలా ప్రాధాన్యత వహిస్తాయి. అయితే త్రివిక్రమ్ సినిమా కథలు చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ వాటిలో జీవిత సత్యాలు ఉంటాయి. ఆయన సినిమాల్లో చెప్పే ప్రతి మాట.. చూపించే ప్రతి సందర్భం ఆడియెన్ ఏదో ఒక టైం లో ఫేజ్ చేసి ఉంటారు. అంతగా ఇంప్యాక్ట్ కలిగేలా చేస్తాడు త్రివిక్రమ్.

 

త్రివిక్రమ్ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకుని ఉంటాయి. అందుకే ఆయన సినిమాల్లో ఉన్న ఎమోషనల్ సీన్స్ మారె సినిమాలో ఉండవు అన్నట్టుగా ఉంటాయి. రైటర్ గా తన పనితనం అంతా తాను డైరెక్ట్ చేసే సినిమాలో కూడా చూపిస్తాడు. అందుకే త్రివిక్రం సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. త్రివిక్రం సినిమా అంటే మాటల్లో మ్యాజిక్ ఉంటుంది. ఆ మాటల్లో సందర్భానికి సంబందించిన భావం ప్రశ్నకు సమాధానంగా.. అవి మన మనసులని తాకుతాయి. 

 

త్రివిక్రమ్ సినిమాల్లో గ్రాఫిక్స్ అద్భుతాలు ఉండవు.. భారీ బడ్జెట్ ఉన్నా పరిధి దాటదు. ఆయన సినిమా చూస్తే ఒక ఎమోషనల్ జర్నీ చేసినట్టు ఉంటుంది. తన మొదటి డైరక్షన్ చేసిన నువ్వే నువ్వే నుండి అల వైకుంఠపురములో వరకు త్రివిక్రమ్ సినిమాలను ఒకసారి అబ్సర్వ్ చేస్తే.. ఒక చిన్న కథ.. కథనం కన్నా మాటలతో నడిపించే తీరు.. ఓ ఇల్లు.. హీరో ఆ ఇంటికెళ్లి సమస్యను సాల్వ్ చేయడం ఇదే జరుగుతుంది. ఇలాంటి కథలతోనే త్రివిక్రమ్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలని ఆశిద్దాం.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: