టాలీవుడ్ మార్కెట్ రోజు రోజుకి విస్తృతంగా పెరుగుతుండ‌డంతో.. దాదాపు చాలా వ‌ర‌కు సినిమాలు దేశ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే మ‌రోవైపు కొత్త కొత్త ద‌ర్శ‌కులు, హీరోలు, హీరోయిన్లు కూడా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో అరంగేట్ర దర్శకులు అదరగొడుతున్నారు. మ‌రియు టాలీవుడ్‌లో అడుగు పెట్టి మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కులు ఎంద‌రో ఉన్నారు. అందులో ముందుగా 'ఆర్ఎక్స్ 100' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి.

 

వైవిధ్య అంశాలతో విడుదలకు ముందు నుంచే ‘ఆర్ఎక్స్ 100’ మంచి టాక్‌ను సొంత చేసుకుంది. రాంగోపాల్ వర్మ శిష్యుడైన అజయ్ త‌న మొద‌టి సినిమాతోనే  అందరి దృష్టిని ఆకర్షించాడు. కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లాంటి యంగ్ టాలెంట్స్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ బోల్డ్ అటెంప్ట్‌తో యూత్ ఫుల్ మెసేజ్ ఇచ్చారు.  అజయ్ భూపతికి బలుపురా అన్న వాళ్ళే..కుర్రోడి దగ్గర విషయం ఉందిరా అనుకున్నారు.

 

అలాగే ‘తొలిప్రేమ’ చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా తొలి చిత్రంతోటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ ప్రేమకథా చిత్ర టైటిల్‌ను తన కొత్త కథకు పెట్టుకుని తనదైన శైలిలో వినూత్నంగా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు వెంకీ అట్లూరి. ఫిదా తరువాత వరుణ్ తేజ్‌కు మరో సూపర్ హిట్ అందించాడు.

 

వెంకీ కుడుముల.. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తోన్న ఈయ‌న‌కు ఇప్పుడు డిమాండ్ మాములుగా లేదు. చూసి చూడంగానే నచ్చేశావే.. లాంటి మ్యూజికల్ హిట్ సాంగ్‌ ప్రేక్షకుల్ని థియేటర్‌కి ‘ఛలో’ అనిపించేలా చేసింది. ఇక థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు యువ దర్శకుడు వెంకీ కుడుముల. 2018 ఏడాది ప్రారంభంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ‘ఛలో’. అలాగే ఈ జాబితాలో ఇంకా చాలా మంది డైరెక్ట‌ర్స్ కూడా ఉన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: